Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీకి వరుస అడ్డంకులు.. ఈసారి అయినా ఫేట్ మారేనా ..?

విజయ్‌ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీకి వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమిర్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్‌ చద్దాతోనే విజయ్‌ నార్త్ డెబ్యూ జరగాల్సింది.

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీకి వరుస అడ్డంకులు.. ఈసారి అయినా ఫేట్ మారేనా ..?
vijay-sethupathi
Follow us
Ram Naramaneni

|

Updated on: May 17, 2021 | 3:13 PM

విజయ్‌ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీకి వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమిర్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్‌ చద్దాతోనే విజయ్‌ నార్త్ డెబ్యూ జరగాల్సింది. కానీ ఆ క్యారెక్టర్‌కు తగ్గ లుక్‌ అచ్చీవ్‌ చేసే టైమ్‌… మక్కల్ సెల్వన్‌కు లేకపోవటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ రోల్‌కు నాగచైతన్యను తీసుకున్నారు ఆమిర్‌. తరువాత సోలో హీరోగా `మెరీ క్రిస్మస్‌` అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్‌ సేతుపతి. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. అంతా ఓకే అనుకున్న టైమ్‌లో సెకండ్ వేవ్ రావటంతో ఈ ప్రాజెక్ట్ కూడా డీలే అయ్యింది. అయితే ఓటీటీ ప్రాజెక్టే కావటంతో ఈ మూవీకి మేజర్‌ చేంజెస్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్‌.

ముందు ఫుల్‌ లెంగ్త్ మూవీగానే ప్లాన్ చేసిన ఇప్పుడా సిచ్యుయేషన్‌ లేకపోవటంతో సినిమా డ్యూరేషన్‌ను 90 మినిట్స్‌కు తగ్గించేశారు. ఎలాగూ ఓటీటీ రిలీజే కాబట్టి డ్యూరేషన్‌ ఇష్యూ ఉండదన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారట. ఇలాగైన మక్కల్‌ సెల్వన్ బాలీవుడ్‌ డెబ్యూ పట్టాలెక్కుతుందేమో చూడాలి. సౌత్ లో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు విజ‌య్ సేతుప‌తి. ఇటీవ‌ల ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యారు. ఆన్ స్క్రీన్ పై న‌ట‌నతో పాటు ఆఫ్ స్క్రీన్ పై త‌న మంచి మ‌న‌సును చాలామంది మ‌న‌సును దోచుకున్నారు.

Also Read:  మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న సిల్వర్‌ స్క్రీన్ జేజ‌మ్మ‌..! ఏ సినిమాలో అంటే..

 ముఖ్యమంత్రిని కలిసి రూ.50 లక్షల విరాళం అందజేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్