Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ఇప్పుడు ఏది ఎక్కడెక్కడుంది.?

ఆ కటవుట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాల్సిన పరిస్థితిని కల్పించేసింది అప్పట్లో బాహుబలి సినిమా. సౌత్ టు నార్త్... అన్ని మార్కెట్లూ ఆ కటవుట్ నే బెంచ్ మార్క్ గా..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ఇప్పుడు ఏది ఎక్కడెక్కడుంది.?
Prabhas
Follow us

|

Updated on: May 17, 2021 | 3:33 PM

Prabhas: ఆ కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాల్సిన పరిస్థితిని కల్పించేసింది అప్పట్లో బాహుబలి సినిమా. సౌత్ టు నార్త్… అన్ని మార్కెట్లూ ఆ కటౌట్ నే బెంచ్ మార్క్ గా పెట్టేసుకున్నాయి. కొడితే ఆ కటౌట్ నే కొట్టాలన్న కమిట్మెంట్ తో పని చేయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే.. ఆ కటౌట్ మీదే ఇప్పుడు వింతవింత డౌట్లు పుట్టేస్తున్నాయా? అవును… నార్త్ సైడ్ మీడియాకు సౌత్ హవా గురించి రాసుకోడానికి ఓ  న్యూస్ దొరికిందట. మన డార్లింగ్ సినిమాల ఫ్యూచర్ లైనప్ మీద మొన్నటి దాకా గొప్పగొప్ప వార్తలు రాసింది బీటౌన్ మీడియా. ఇప్పుడు మాత్రం ఫేస్ టర్న్ ఇచ్చుకుంటోంది. డార్లింగ్ కటౌట్ కి నిజంగా అంత సీనుందా? అనేది అక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లీడ్. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ఇప్పుడు ఏది ఎక్కడెక్కడుంది.? అని ఆరా తీస్తే.. కావాల్సినన్ని నెగిటివ్ వార్తలు దొరికేస్తున్నాయట. క్యూలో వున్న ఫస్ట్ మూవీ రాధేశ్యామ్ ప్రోగ్రెస్ మొదటినుండీ సందేహాస్పదంగానే వుంది. పైగా… ఫైనల్ ఔట్ ఫుట్ కి పదేపదే రిపేర్లు జరుగుతున్నాయన్న వార్తలు అనుమానాల్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఇక.. మైథలాజికల్ అడ్వెంచర్… ఆదిపురుష్ స్టేటస్ ఏంటి? ముహూర్తం రోజే ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగి… ఆదిపురుష్ టీమ్ లో ఒకవిధమైన నైరాశ్యం నింపింది. తర్వాత ఆర్టిస్ట్‌ల డేట్స్ అడ్జస్ట్ కాక కొన్నిరోజులు షూటింగ్ ఆగింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో మోస్ట్ అడ్వాన్స్డ్ గా దూసుకెళ్తున్నాం అని డైరెక్టర్ ఓం రౌత్ అనౌన్స్ చేయగానే ముంబైలో లాక్‌ డౌన్‌ పెట్టేశారు. ప్రభాస్‌ తో పాటు అందరూ ముంబైకి టాటా చెప్పి వెళ్లిపోయారు. సరే… హైదరాబాద్‌ కొచ్చి ఫిలిం సిటీలో సేమ్ సెట్‌ వేసుకుని.. షాట్ రెడీ చెప్పగానే.. ఇక్కడ కూడా లాక్ డౌన్. ఇదీ ఆదిపురుష్ మూవీ ప్రజెంట్ స్టేటస్. సౌత్ లో మరో ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్2తో పోలుస్తున్నారు ఆదిపురుష్ ని. ఇదే విధంగా కష్టాలు కంటిన్యూ అయితే ప్రాజెక్టు అటకెక్కుతుందా అనేదాకా వెళ్లాయి బాలీవుడ్ మీడియాలో స్పెక్యులేషన్లు. అటు… నాగీ చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ.. ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. కాస్టింగ్ ఎంత బలంగా వున్నా బోలెడు ప్రాక్టికాలిటీ సమస్యలున్న ఈ మూవీపై కాన్ఫిడెన్స్ కలగాలంటే నాగ్ అశ్విన్ నుంచి ఏదో ఒక విజువల్ క్లారిటీ రావాల్సిందేనట. కానీ.. ఇప్పుడున్న క్రిటికల్ కండిషన్స్ అన్నీ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే నాగీకి తననుతాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చేది. సో.. సడన్ గా మొదలై శరవేగంగా నడుస్తున్న సలార్ ఒక్కటే ప్రభాస్ లైనప్ లో స్ట్రాంగ్ ఫీల్ కలిగించే సినిమా. ప్రభాస్ ఎదుగుదల మీద ఎప్పటినుంచో ఓ కన్నేసి ఉంచినవాళ్లకు ఇవన్నీ మాట్లాడుకోడానికి పనికొచ్చే వార్తలే మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Pavala Syamala: కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల కన్నీటి గాథ.. సాయం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నటి

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన