Pooja Hegde: ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలో చెబుతోన్న బుట్టబొమ్మ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా..
Pooja Hegde: కరోనా మహమ్మారి యావత్ మానవాళిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై అందరిలో అవగాహన...
Pooja Hegde: కరోనా మహమ్మారి యావత్ మానవాళిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై అందరిలో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ ఒక్కరూ ఇంట్లో ఆక్సీమీటర్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే కొందరు దానిని ఎలా ఉపయోగించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి పూజా హెగ్డే ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తాను తరచూ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చిన పూజా.. డాక్టర్లు చెప్పే వరకు ఆక్సీమీటర్‌ని ఎలా ఉపయోగించాలో అర్థం కాలేదని చెప్పింది. ఈ క్రమంలోనే ఆక్సీమీటర్‌ను ఉపయోగించే పద్ధతిని చక్కగా వివరించింది. ఇంతకీ పూజా ఏం చెప్పిందో ఓసారి చూసేయండి..
పూజా హెగ్డే పోస్ట్ చేసిన వీడియో..
View this post on Instagram
ఇక కెరీర్ విషయానికొస్తే పూజా హెగ్డే చివరిగా అల.. వైకుంఠపురుము చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అఖిల్‌కు జోడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంతో పాటు ఆచార్యలో రామ్‌కు జోడిగా నటిస్తోంది.
Also Read: sonu sood : సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ.. స్పందించిన రియల్ హీరో..
Varun Tej: మరో సూపర్ హిట్ డైరెక్టర్ తో చేతులు కలిపిన మెగా హీరో వరుణ్ తేజ్.. ఈసారి