ఆ లోపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం.. డబ్ల్యూహెచ్‌వో ఆశాభావం

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్‌ 19పై పోరాటం చేస్తుంది. ఈ వైరస్‌ సోకిన వారిలో చాలా మంది కోలుకుంటున్నప్పటికీ, విస్తరణ మాత్రం రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది.

ఆ లోపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం.. డబ్ల్యూహెచ్‌వో ఆశాభావం
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 3:10 PM

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్‌ 19పై పోరాటం చేస్తుంది. ఈ వైరస్‌ సోకిన వారిలో చాలా మంది కోలుకుంటున్నప్పటికీ, విస్తరణ మాత్రం రోజురోజుకు ఎక్కువవుతోంది. పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితాలు కనిపించలేదు. మరికొన్ని దేశాల్లో తగ్గినట్లుగానే కనిపించిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారికి అడ్డుకట్టవేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే పనిలో చాలా దేశాలు తలమునకలై ఉన్నాయి.

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌కి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్న ఆశాభావంతో డబ్ల్యూహెచ్‌ఓ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కరోనాకు అడ్డుకట్టే వేసే క్లినికల్ ట్రయల్స్‌కి సంబంధించిన ఓ ప్రయోగం మూడో దశకు చేరుకున్నట్లు సౌమ్య తెలిపారు. ఇక కరోనా మరణాలను ఎదుర్కోవడంలో గేమ్‌ చేంజర్‌ అని ట్రంప్‌ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి వాటిని నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పుకొచ్చారు.

Read This Story Also: 5వేలకు చేరువలో ఒడిషా..తాజాగా 165 కరోనా కేసులు..