కరోనా సంక్షోభంలోనూ.. రైల్వేలో భారీగా నియామకాలు..
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్

Railway ALP and Technician Recruitment: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ఏఎల్‌పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది.
కాగా.. 10123 మంది ఏఎల్‌పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. నియామక పత్రాలు లాక్‌డౌన్ కన్నా ముందే పంపినప్పటికీ కరోనా నేపథ్యంలో చాలా మంది విధుల్లో చేరలేదని ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మొద్దని, అధికారిక వెబ్‌సైట్లు చూడాలని అభ్యర్థులకు సూచించింది.
Also Read: ఆన్‌లైన్ బోధనకోసం ‘విద్యాదాన్’



