ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాదాన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు

ఆన్‌లైన్‌ బోధనకోసం 'విద్యాదాన్'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 19, 2020 | 2:35 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాదాన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయుల నుంచి ఎస్‌సిఈఆర్‌టి నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఈనెల 30వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

కాగా.. దీనికి సంబంధించి జిల్లా విద్యా శాఖాధికారులు, ఆర్జేడీలకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సిఈఆర్‌టి) డైరెక్టర్‌ ఒక సర్క్యులర్‌ను పంపారు. ఆన్‌లైన్‌లో తరగతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 21న విద్యాదాన్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నుంచి దీనిని అమలు చేస్తున్నామన్నారు.