5వేలకు చేరువలో ఒడిషా..తాజాగా 165 కరోనా కేసులు..

ఒడిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.

5వేలకు చేరువలో ఒడిషా..తాజాగా 165 కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 1:52 PM

ఒడిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వందకు పైగా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,677కు చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,519 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి గురువారం నాటికి 11 మంది మరణించారు.

ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 3.8లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో2.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటికే కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 12 వేల 500 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.25 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.