ఆ రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులకు అనుమతి..

దేశవ్యాప్త లాక్ డౌన్ పూర్తి అయిన అనంతరం మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఫ్యాక్టరీలు, బస్సులు, ట్యాక్సీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాక టీ, సిగరెట్ షాపులకు కూడా అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సీఎం మమతా బెనర్జీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అనుమతి ఇస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం […]

ఆ రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులకు అనుమతి..
Ravi Kiran

|

Apr 29, 2020 | 9:17 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ పూర్తి అయిన అనంతరం మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఫ్యాక్టరీలు, బస్సులు, ట్యాక్సీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాక టీ, సిగరెట్ షాపులకు కూడా అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సీఎం మమతా బెనర్జీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అనుమతి ఇస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

లాక్ డౌన్ విషయంలో కేంద్రం నుంచి నూతన మార్గదర్శకాలు వచ్చేదాకా ప్రజలకు ఇళ్లకే పరిమితం కావాలని ఆమె తెలిపారు. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరని.. ఇప్పటికే చాలా దేశాలు జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించాయని దీదీ స్పష్టం చేశారు. కాగా, గ్రీన్ జోన్లలో స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఇక గ్రీన్ జోన్లలో బస్సుల్లో 20 మంది, ట్యాక్సీలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని మమతా బెనర్జీ స్పష్టం చేసింది.

Read More: 

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..

‘నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది’.. ఇర్ఫాన్ చివరి మాటలు.. అందర్నీ ఏడిపిస్తున్నాయి..

సొంత పార్టీ నేతకు షాకిచ్చిన జగన్.. ఆ ఎంపీ భర్తపై క్రిమినల్ కేసు నమోదు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu