కరోనా వేళ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహామ్మరితో గడగడలాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు తన వక్ర బుద్దిని చూపిస్తూనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు భారత్‌ సైన్యంపై దొంగచాటుగా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాక్ ఇంటలిజెన్స్ అధికారులు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో పెద్ద కుట్ర చేయబోతున్నారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ -19 నేపథ్యంలో ఒకరి లొకేషన్ డేటాను సేకరించి, దాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కోవిడ్ […]

కరోనా వేళ పాకిస్తాన్ భారీ కుట్ర.. 'ఆరోగ్య సేతు' యాప్‌తో..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 3:49 PM

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహామ్మరితో గడగడలాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు తన వక్ర బుద్దిని చూపిస్తూనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు భారత్‌ సైన్యంపై దొంగచాటుగా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాక్ ఇంటలిజెన్స్ అధికారులు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో పెద్ద కుట్ర చేయబోతున్నారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

కోవిడ్ -19 నేపథ్యంలో ఒకరి లొకేషన్ డేటాను సేకరించి, దాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కోవిడ్ -19 పరీక్షల డేటాబేస్‌తో క్రాస్ రిఫరెన్స్ చేయడం కోసం ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కేంద్రం రూపొందించింది. దీని ద్వారా కరోనా సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే వినియోగదారుని ఇది హెచ్చరిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్‌కు చెందినా ఇంటెల్ ఆపరేటర్స్ ‘హానికరమైన’ నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ని అభివృద్ధి చేసి యునైటెడ్ కింగ్‌డమ్‌(బ్రిటన్) నుంచి వాట్సాప్ ద్వారా భారత రక్షణ సిబ్బందికి పంపినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

ఒకసారి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మనకు తెలియకుండానే సున్నితమైన సంచారం మొత్తం వేరేవాళ్లకు చేరిపోతుందని రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ విషయం ఆర్మీ మేజర్లకు తెలియడంతో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి గానీ.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, గతంలోనే ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ఆర్మీ అధికారులు కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్స్ వద్దకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read More:

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!