లాక్ డౌన్ వేళ.. సరుకుల కోసం వెళ్లి.. పెళ్లి చేసుకొని తిరిగొచ్చాడు..

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కుమారుడు తన తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు. సరుకుల కోసం ఇంటి నుంచి బయటకు

  • Tv9 Telugu
  • Publish Date - 9:22 pm, Wed, 29 April 20
లాక్ డౌన్ వేళ.. సరుకుల కోసం వెళ్లి.. పెళ్లి చేసుకొని తిరిగొచ్చాడు..

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కుమారుడు తన తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు. సరుకుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను.. వివాహం చేసుకొని పెళ్లికూతురితో కలిసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో గత రెండు నెలలుగా ఇంటి నుంచి కాలు బయటపెట్టని అతని తల్లి.. వాళ్లిద్దరి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లింది. తన కుమారుడి ఆలోచనల్ని ముందగానే పసిగట్టలేకపోయానని ఆ తల్లి వాపోయింది.

కాగా.. వీరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరికి వివాహానికి సంబంధించి ఎటువంటి రుజువులు లేవని పోలీసులు తెలిపారు. వీరి వివాహం జరిపించిన పూజారి కూడా పెళ్లిని ధృవీకరించాలంటే.. అది లాక్‌డౌన్ తర్వాతేనని స్పష్టం చేశారు. అయితే అప్పటివరకూ ఆ పెళ్లికూతురిని తన ఇంట్లోకి అనుమతించనని వరుడి తల్లి తెలిపింది. కానీ, పోలీసుల వారికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపిచినట్లు సమాచారం.

[svt-event date=”29/04/2020,8:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]