మే నెలలో 13 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..
ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి.. మరో వైపు దేశవ్యాప్త లాక్ డౌన్.. ఈ రెండు వెరిసి ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కష్టకాలంలో బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇది ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. మరోవైపు కరోనా కాలంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి వచ్చే నెలలో బ్యాంకు సెలవు దినాలు తెలుసుకుని మీ పనికి ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కబెట్టుకోండి. అంతేకాక లాక్ డౌన్ నడిస్తోంది […]

ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి.. మరో వైపు దేశవ్యాప్త లాక్ డౌన్.. ఈ రెండు వెరిసి ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కష్టకాలంలో బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇది ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. మరోవైపు కరోనా కాలంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి వచ్చే నెలలో బ్యాంకు సెలవు దినాలు తెలుసుకుని మీ పనికి ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కబెట్టుకోండి. అంతేకాక లాక్ డౌన్ నడిస్తోంది కాబట్టి మొదటి 14 రోజులు బ్యాంకు పనులు కాస్త మందగించే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకులు కేవలం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి.
మే నెలలో, దేశవ్యాప్తంగా బ్యాంకులు 13 రోజుల పాటు బంద్ కానున్నాయి. ఏది ఏమైనా, బ్యాంకులు పని చేయని ఈ రోజులలో రెండు శనివారాలు, ఐదు ఆదివారాలు ఉండటమే కాకుండా బుద్ధ పూర్ణిమ, రంజాన్ కూడా ఇతర సెలవుల్లో ఉన్నాయి. అటు స్టాక్ మార్కెట్లు మే 1, మే 25న బంద్ అవుతాయి. ఇక పైన పేర్కొన్నవి కాకుండా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మే 1), రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (మే 8 న) నాడు కూడా బ్యాంకులను మూసి వేస్తారు. కాబట్టి, మీరు క్రొత్త డెబిట్ / క్రెడిట్ కార్డు పొందడానికి బ్యాంకులను సందర్శించాలనుకుంటే, లేదా మరేదైనా ఆర్థిక కార్యకలాపాలు చేయాలనుకుంటే, మీరు మీ ఇంటి నుండి బయలుదేరే ముందు ఈ క్రింది సెలవుల జాబితాను ఒక్కసారి చూసుకోండి.
బ్యాంకుల సెలవుల లిస్టు ఇదే…
మే 1 – అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం( బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజి, పాట్నా, తిరువునంతపురం) మే 3 – ఆదివారం మే 7 – బుద్ద పూర్ణిమ( అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీఘర్, డెహ్రాడున్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, లక్నో, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, షిల్లోంగ్) మే 8 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి( కోల్‌కతా) మే 9 – రెండో శనివారం మే 10 – ఆదివారం మే 17 – ఆదివారం మే 23 – నాలుగో శనివారం మే 24 – ఆదివారం మే 25 – రంజాన్ మే 31 – ఆదివారం
Read This: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి..