Joy e-bikes: ఈ స్కూటర్లకు లైసెన్స్ లేకపోయినా రయ్..రయ్.. పైగా రూ.13 వేల డిస్కౌంట్!
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ క్రమంగా విస్తరించకుంటూ ముందుకు సాగుతోంది. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల తరుగుదల, కాలుష్య నివారణ తదితర వాటిపై ప్రజలకు పెరిగిన అవగాహనతో సంప్రదాయ పెట్రోలు వాహనాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని నగరాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరిగేలా నిబంధనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

వివిధ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాలపై అనేక రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై దాదాపు రూ.13 వేల తగ్గింపును అందజేస్తున్నారు. ఈ వాహనాల ప్రత్యేకత, ఇతర వివరాలను తెలుసుకుందాం. వార్డ్ విజార్జ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ.. జాయ్ బ్రాండ్ పేరు మీద ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. ఖాతాదారుల సౌలభ్యంతో పాటు తన విక్రయాలను పెంచుకునే క్రమంలో తన వాహనాలపై రూ.13 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. జాయ్ బ్రాండ్ కింద విడుదలైన వోల్ఫ్ 31ఏహెచ్, జెన్ నెక్ట్స్ 31 ఏహెచ్, నాను ప్లస్, వోల్ప్ ప్లస్, నానా ఎకో, వోల్ప్ ఎకో తో పాటు ఎంపిక చేసిన అన్ని రకాల స్కూటర్లపై ఖాతాదారులు ఈ తగ్గింపును పొందవచ్చు.
వార్డ్ విజార్డ్ కంపెనీ తన ఈవీల ధరలను తగ్గించడం వెనుక అనేక కారణాలున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ లో తన ఉనికిని మరింత పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఎక్కువ మంది ఖాతాదారులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనే స్కూటర్ల ధరలను తగ్గించి, సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వారి కోసం తక్కువ వేగం కలిగిన స్కూటర్లపై డిస్కౌంట్లు అందజేస్తోంది. అయితే మిహూస్, నెమో తదితర హై స్పీడ్ బ్రాండ్లకు ఇది వర్తించదు.
సాధారణంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారికి లైసెన్సు చాలా అవసరం. కానీ తక్కువ వేగం గల వాహనాలకు అవసరం లేదు. జాయ్ ఈ బైక్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్లలో లో స్పీడ్ వాహనాల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఈ కారణంగా వాటిని నడిపేవారికి లైసెన్సు అవసరం లేదు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ముఖ్యంగా పెద్దవారు, మహిళలు, మేజర్లయిన పిల్లలు చక్కగా నడవపచ్చు.
జాయ్ బ్రాండ్ లోని తక్కువ వేగం కలిగిన ఇ-స్కూటర్లపైనే రూ.13 వేల డిస్కౌంట్ అమలవుతుంది. వీటిని కొనుగోలు చేసిన వారికి డ్రైవింగ్ లెసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ కంపెనీ ద్వారా దాదాపు పది పైగా హై స్పీడ్, లో స్పీడ్ కేటగిరిలో వాహనాలు మార్కెట్ లో ఉన్నాయి. దేశంలోని సుమారు 400లకు నగరాలు, పట్టణాల్లో విక్రయాలు జరుపుతోంది. కొన్నేళ్లలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








