IPL 2025: మరీ ఇంత దిగజారుతారా? శ్రేయస్ అయ్యర్ సిస్టర్ సీరియస్.. అసలు ఏం జరిగిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 37వ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.5 బంతుల్లోనే చేధించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ సోదరిపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

IPL- 2025 లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 20న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ముల్లాన్‌పూర్‌లోని MYS స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.5 ఓవర్లలో 159 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ ఓటమి తర్వాత, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్టా అయ్యర్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కొందరు నెటిజన్లు పనిగట్టుకుని మరీ శ్రేష్ఠ అయ్యర్ ను తిడుతున్నారు. ఈ విషయాన్ని శ్రేయస్ సోదరినే వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో శ్రేష్ట ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పంజాబ్ జట్టు ఓటమికి మా కుటుంబాన్ని నిందిస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము అక్కడ ఉన్నా లేకపోయినా, పంజాబ్ కింగ్స్ జట్టుకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఓటమికి నన్ను నిందిస్తున్న మీ ఆలోచనలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇది చాలా సిగ్గుచేటు విషయం. నేను గతంలో చాలా మ్యాచ్‌ల్లో కనిపించాను. అది టీం ఇండియా అయినా లేదా మరేదైనా మ్యాచ్ అయినా. ఈసారి మేము ఎక్కువ మ్యాచ్ లు గెలిచాం. కానీ మీకు నిజం అవసరం లేదు. నా అభిప్రాయం ప్రకారం మీ పని తెరవెనుక నిలబడి మమ్మల్ని ట్రోల్ చేయడమే’
‘నేను ఎల్లప్పుడూ నా సోదరుడికి, అలాగే అతని బృందానికి పూర్తిగా మద్దతు ఇస్తాను. మీ అసంబద్ధ ప్రకటనలు, కామెంట్స్ నా ప్రవర్తనలో తేడాను కలిగించవు. ఇది మీ ఉద్దేశ్యాన్ని చూపిస్తుంది. జట్టు గెలిచినా, ఓడినా, నా మద్దతు ఉంటుంది. ఈరోజు పంజాబ్ కింగ్స్ జట్టుకు అనుకూలమైన రోజు కాదు. కానీ గెలుపు, ఓటములు ఆటలో భాగం. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కాకుండా వేరే ఏదైనా చేయడం లేదా నేర్చుకోవడం గురించి ఆలోచించండి. అప్పుడే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి* అని శ్రేష్ఠా అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
శ్రేయస్ అయ్యర్ సోదరి ఇన్ స్టా స్టోరీ పోస్ట్..
Shreyas Iyer’s sister, Shresta Iyer, shared an Instagram story about being abused by Virat Kohli fans. Shameful by #ViratKohli fans 🤡#ShreyasIyer #RCB #PBKS #TATAIPL pic.twitter.com/GXAdslZu33
— भारत सिंह 🇮🇳 (@oscarbharat) April 21, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








