AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినీ ప్రముఖుల సడెన్ వెయిట్‌ లాస్‌కు ఈ ఇంజెక్షన్లే కారణమా? సైడ్ ఎఫెక్ట్స్‌తో బక్కచిక్కిపోతున్నారా?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. తన అదనపు బరువును తగ్గించడానికి కరణ్ అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడని ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

Tollywood: సినీ ప్రముఖుల సడెన్ వెయిట్‌ లాస్‌కు ఈ ఇంజెక్షన్లే కారణమా? సైడ్ ఎఫెక్ట్స్‌తో బక్కచిక్కిపోతున్నారా?
Karan Johar
Basha Shek
|

Updated on: Apr 20, 2025 | 3:47 PM

Share

సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగించాలంటే అభినయంతో పాటూ అందమూ ముఖ్యమే. ముఖ్యంగా హీరోయిన్లు ఎంతో నాజూకుగా, సన్నగా, మెరుపు తీగలా ఉండాలనుకుంటారు. ఇందుకోసం గంటల తరబడి జిమ్ లో గడుపుతుంటారు. అలాగే కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇలా సహజమైన పద్ధతుల్లో బరువు తగ్గితే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇటీవల కొందరు సినీ ప్రముఖులు తమ అదనపు బరువును తగ్గించుకునేందుకు అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం ఓజెంపిక్ అనే ఇంజెక్షన్లను విరివిగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సడెన్ వెయిట్ లాస్ విషయంలో ఈ ఓజెంపిక్ ఇంజెక్షన్ల పేరు బాగా వినిపించింది. కరణ్ వీటిని వాడలేదని క్లారిటీ ఇచ్చినా చాలా మంది సినీ ప్రముఖులు ఈ ఇంజెక్షన్లను ఉపయోగించి బరువు తగ్గుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి అసలేంటీ ఓజెంపిక్‌ ఇంజెక్షన్‌. దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? అసలు ఈ మెడిసిన్ గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

మధుమేహం మందు చివరికీ..

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఓజెంపిక్ ఇంజెక్షన్ ను‌ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో మొదటి సారిగా దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. కాగా ఓజెంపిక్ ఇంజెక్షన్ ఆకలిని బాగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అలాగే అనవసర కొవ్వును కూడా బాగా తగ్గిస్తుంది. ఫలితంగా ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

వృద్ధాప్య ఛాయలతో..

కాగా ఓజెంపిక్ ఇంజెక్షన్ ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో దీనిని బరువు తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓజెంపిక్ ఇంజెక్షన్ ను వాడిన పలువురు కొందరు ప్రముఖులు బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడి వృద్ధుల్లా కనిపిస్తున్నారు. గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాను కూడా  ఓజెంపిక్ మెడిసిన్ వాడుతూ ఫిట్ గా ఉండగలుగుతున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే హాలీవుడ్ లో షరాన్, ఓఫ్రా విన్ ఫ్రా ఫేమస్ సెలబ్రిటీలు ఈ మెడిసిన్ వాడుతున్నట్లు ప్రచారం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.