Actress Hema: కరాటే కల్యాణి, తమన్నాలకు నటి హేమ లీగల్ నోటీసులు.. కారణమిదే
సీనియర్ నటి హేమ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ మధ్యన సినిమాలకు గుడ్ బై చెప్పానంటూ సంచలన కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. మరి ఉన్నట్లుండి హేమ ఇలా కారాలు మిరియాలు నూరడానికి కారణమేంటో తెలుసుకుందాం రండి.

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఇప్పుడు ఉన్నట్లుండి కారాలు మిరియాలు నూరుతోంది. తనపై తప్పుడు ప్రచారం చేశారని, తన పరువుకు భంగం కలిగించారంటూ ఆమె పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఛానెల్స్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమవుతోంద. హేమ నోటీసులు పంపిన వారిలో ప్రముఖ నటి కరాటే కల్యాణి, అలాగే బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రిలతో పలు యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఉన్నాయి. వీరందరూ గతంలో తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని హే ఆరోపించారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇలా లీగల్ నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. ‘ కొన్ని రోజుల క్రితం నేను ఓ సమస్యలో ఇరుక్కున్నాను. అప్పుడు వీరందరూ నాపై బురద చల్లే ప్రయత్నం చేశారు. నాపై మీడియాలోనే అసభ్యంగా మాట్లాడారు. నోరుంది కదా అని మా వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నిజాలైనా కొన్ని సందర్భాల్లో మాట్లాకూడదు. అలాంటిది చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేశారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు నెట్‌లో కొడితే వస్తున్నాయి. నేను తప్పు చేయకుండానే బ్లేమ్ అయ్యాను. అందుకే మాటల్లో కాకుండా ఈసారి న్యాయస్థానానికి వెళ్లా. నా పరువుకు నష్టం కలిగింది. ఇందులో భాగంగానే లీగల్ నోటీసులు ఇచ్చాను.
‘ఈ మధ్యన మా సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. నాలా మరొకరికి నష్టం జరగకుండా ఉండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంకా కొంతమంది అడ్రస్‌లు, వివరాలు తెలియరాలేదు’ అని నటి హేమ తెలిపింది.
కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరైందన్న ఆరోపణలతో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు కూడా తరలించారు. కొన్ని రోజులకు బెయిల్‌పై ఆమె విడుదలైంది. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేసింది. తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిదే వ్యవహారానికి సంబంధించే పలువురు ప్రముఖులకు లీగల్ నోటీసులు పంపింది హేమ.
నటి హేమ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి