Deepak Chahar: దీపక్ చాహర్ సోదరి సినిమా హీరోయిన్ అని తెలుసా? మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ గురూ! లేటెస్ట్ ఫొటోస్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు దీపక్ చాహర్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈ సారి మాత్రం ముంబై టీమ్ జెర్సీతో బరిలోకి దిగాడు. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే.. దీపక్ చాహర్ సోదరి ఓ సినిమా సెలబ్రిటీ.

ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అదులో షేర్ చేస్తుంటుంది. గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది. గతంలో చాహర్ ఆడిన పలు మ్యాచ్ లకు మాలతీ హాజరైంది. ఇక ప్రస్తుత సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆడిన చాలా మ్యాచ్‌ల్లోనూ ఈ అందాల తార కనిపించింది. ముందుగా ఐపీఎల్ 2018లో కోల్‌కతా, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మాలతీ చాహర్ ఒక మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయిపోయింది. కానీ ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని వెల్లడైంది. అన్నట్లు మాలతి సోషల్ మీడియాలో అనేక బ్రాండ్లను ఎండార్స్ చేస్తోంది. అంతేకాదు ఆమె ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమా రంగంలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.
మాలతి చాహర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఓ మైరి.ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రముఖులు అభిమానులు మాలతీ చాహర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు, ప్రీమియర్స్ లలో మాలతి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఆమె సోదరుడు దీపక్ చాహర్, వదిన జయ చాహర్ కూడా ఈ స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేయడం విశేషం.
సినిమా ప్రమోషన్లలో దీపక్ చాహర్ సోదరి..
View this post on Instagram
దీపక్ చాహర్ , రాహుల్ చాహర్ క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుకుంటుండగా, వారి సోదరి మాలతీ మాత్రం సినిమా రంగంలో తన కెరీర్ ను నిర్మించుకుంటోంది. మిస్ ఢిల్లీ పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచిన ఆమె గతంలో మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. ఆ తర్వాత పలు యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ లలో నటించి మెప్పించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన జీనియస్ చిత్రానికి మాలతీ వర్క్ చేసింది. ఇక మాలతీ నటనా జీవితం ‘ఇష్క్ పష్మినా’ చిత్రంతో ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ గానూ సత్తా చాటింది.
మాలతి చాహర్ గ్లామరస్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








