88 టెస్ట్‌లు, 362 వికెట్లు.. 21 ఏళ్ల కెరీర్‌లో ఒక్క నోబాల్ వేయని తోపు బౌలర్.. కట్‌చేస్తే.. నేడు జైలులో..
Unbelievable Cricket Feat: ఓ క్రికెట్ దిగ్గజం తన 21 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 362 వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. 88 టెస్ట్ మ్యాచ్‌లు, 175 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్ డేంజరస్ బౌలింగ్‌తో పాటు, అద్భుతమైన బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, అతని క్రికెట్ రికార్డులు చరిత్రలో నిలిచిపోయాయి.

Imran Khan No Ball Record: క్రికెట్‌లో ప్రతిరోజూ ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. మరికొన్ని బద్దలవుతుంటాయి. అయితే, కొందరు ఆటగాళ్లు తమ ప్రత్యేకతతో క్రికెట్ ప్రపంచంలో తమ కంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. తన 21 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్ ఉన్నాడని మీకు తెలుసా? బౌలర్లు తరచుగా నో బాల్ వేస్తుంటారు. పొరపాటున కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఇక ఓ బౌలర్ వికెట్ తీసిన సందర్భంలో నో బాల్ వేస్తే.. తన సొంత జట్టుకే అతిపెద్ద విలన్‌లా మారుతుంటాడు. ఇలాంటి తప్పుల వల్ల జట్లు తరచుగా మ్యాచ్‌లను ఓడిపోవలసి వస్తోంది. అయితే, తన కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయని ఓ బౌలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తన 21 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్ ఉన్నాడు. పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన 21 సంవత్సరాల టెస్ట్ కెరీర్ మొత్తంలో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ టెస్ట్ క్రికెట్‌లో 362 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. అయితే, ఎప్పుడూ నో బాల్ వేయలేదు. తన కెప్టెన్సీలో, ఇమ్రాన్ ఖాన్ 1992 ప్రపంచ కప్ టైటిల్‌ను పాకిస్తాన్ అందించాడు.
88 టెస్టులు, 175 వన్డేలు..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ డేంజరస్ బౌలింగ్‌తోపాటు తుఫాన్ బ్యాటింగ్ రెండింటిలోనూ నిష్ణాతుడిగా పేరుగాంచాడు. తన బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్ల బ్యాటర్లకు ఓ పీడకలగా మారాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తరపున 88 టెస్టులు ఆడి 3807 పరుగులు చేయగా, 175 వన్డేల్లో 3709 పరుగులు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ టెస్టుల్లో 362 వికెట్లు, వన్డేల్లో 182 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తరపున టెస్ట్ మ్యాచ్‌లలో ఇమ్రాన్ ఖాన్ 18644 బంతులు బౌల్ చేశాడు. కానీ, ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ చేసేటప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉన్నాడో ఈ రికార్డులు చూపిస్తున్నాయి.
ప్రస్తుతం జైలులో..
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. పాకిస్తాన్ కోర్ట్ భూ అవినీతి కేసులో ఈ దిగ్గజానికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








