AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs GT: 1,6,6,6,6,6.. 2 ఏళ్ల 12 రోజుల తర్వాత రివేంజ్ ప్లాన్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

KKR vs GT Predicted Playing XI: కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ కారణంగా, ఈ మ్యాచ్‌లో గెలవడం కోల్‌కతాకి చాలా ముఖ్యం.

KKR vs GT: 1,6,6,6,6,6.. 2 ఏళ్ల 12 రోజుల తర్వాత రివేంజ్ ప్లాన్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Kkr Vs Gt Predicted Playing Xi
Venkata Chari
|

Updated on: Apr 21, 2025 | 1:01 PM

Share

KKR vs GT Predicted Playing XI: ఐపీఎల్ 2025 లో, ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 39వ మ్యాచ్ అవుతుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు నిలకడగా మ్యాచ్‌లను గెలుస్తోంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన ఇప్పటివరకు మిశ్రమంగా ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ కారణంగా, ఈ మ్యాచ్‌లో గెలవడం కోల్‌కతాకి చాలా ముఖ్యం.

ఇక ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుకుంటే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టులాగే ఉంటుంది. సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు ఆడటం చూడొచ్చు. గత మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 112 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ కారణంగా కోల్‌కతా జట్టు చాలా ఒత్తిడిలో ఉంది. ఈసారి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటోంది.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్‌లో ఆ జట్టు చాలా బాగా ఆడుతోంది. గుజరాత్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్‌కు చాలా సులభంగా చేరుకుంటారని తెలుస్తోంది. టైటాన్స్ జట్టుకు మంచి విషయం ఏమిటంటే, టాప్ ఆర్డర్ నుంచి ఎవరో ఒకరు బ్యాట్స్‌మన్ జట్టు తరపున నిలబడి, మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. జట్టులోని టాప్-3 అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది.

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ/వాషింగ్టన్ సుందర్.

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

2 ఏళ్ల 12 రోజుల పగ..

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రింకూ సింగ్ సిక్సర్ల బీభత్సం. ఐపీఎల్ 2023లో భాగంగా 13వ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఏప్రిల్ 9న జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ అందించిన 204 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా విజయానికి చివరి 6 బంతుల్లో 29 పరుగులు కావాల్సి ఉంది. రింకూ సింగ్ 20వ ఓవర్‌లో 1,6,6,6,6,6 సిక్స్‌లతో చెలరేగిపోవడంతో కేకేఆర్ అద్భుత విజయం సాధించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..