AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: దొరికేశారోచ్.. సచిన్, గంగూలీ రీప్లేస్‌మెంట్స్ పట్టేసిన సెలెక్టర్లు.. ఎవరంటే?

IPL 2025 Unveils Team India's Future Teen Openers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భారత జట్టు తదుపరి ఓపెనింగ్ జోడీని బీసీసీఐ గుర్తించింది. సచిన్ టెండూల్కర్, గంగూలీ లాంటి ఓపెనింగ్ జోడీని పట్టేసిన సెలెక్టర్లు.. త్వరలో ఈ యువ ఆటగాళ్లిద్దరిని భారత జట్టు సీనియర్ జట్టులోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది.

Team India: దొరికేశారోచ్.. సచిన్, గంగూలీ రీప్లేస్‌మెంట్స్ పట్టేసిన సెలెక్టర్లు.. ఎవరంటే?
Team India Next Openers
Venkata Chari
|

Updated on: Apr 21, 2025 | 12:32 PM

Share

Team India Next Openers Ayush Matre – Vaibhav Suryavanshi: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ల ఓపెనింగ్ జోడీ ఒంటి చేత్తో టీం ఇండియాకు అనేక మ్యాచ్‌లలో విజయాలను అందించిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 1992 నుంచి 2007 వరకు 176 ఇన్నింగ్స్‌లలో భాగస్వామ్యాలను పంచుకున్నారు. ఇందులో ఇద్దరూ కలిసి 47.55 సగటుతో 8227 పరుగులు చేశారు. ఈ ఓపెనింగ్ జోడీ రీప్లేస్‌మెంట్ చేయడంలో బీసీసీఐ ఇన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా భారత జట్టుకు వీరి ప్రత్యామ్నాయాలను కనుగొంది. టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ త్వరలో ఇద్దరు యువ భారత ఆటగాళ్లకు టీం ఇండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ఐపీఎల్ 2025లో దొరికిన ఇద్దరు స్టార్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ లీగ్ భారత జట్టుకు చాలా మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. వీరిలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. నేడు ఈ ఇద్దరు దిగ్గజాలు టీం ఇండియాకు కీలక స్తంభాలుగా మారారు. త్వరలో వీరిద్దరు రిటైర్మెంట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీం ఇండియా మరో ఇద్దరు యువ ఆటగాళ్లను పొందబోతోంది. వీరి పేర్లు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా ప్రపంచ క్రికెట్‌లో తమ ఉనికిని చాటుకున్నారు. ప్రత్యేకత ఏమిటంటే వైభవ్, ఆయుష్ ఇద్దరూ అండర్-19 టీం ఇండియాలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్‌గా ఆడుతున్నారు.

14 ఏళ్లకే సత్తా చాటిన వైభవ్..

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. తన ఐపీఎల్ కెరీర్‌లోని మొదటి బంతికే శార్దూల్ ఠాకూర్ బంతిని స్టాండ్స్‌లోకి పంపి, తాను లాంగ్ రేస్‌ గుర్రం అని, త్వరలో భారత జట్టులోకి బలమైన ఎంట్రీ ఇస్తానని ప్రపంచానికి చాటి చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై వైభవ్ కేవలం 20 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ కాలంలో వైభవ్ స్ట్రైక్ రేట్ 170గా ఉంది. వైభవ్ ఇలాగే రాణిస్తే, త్వరలోనే టీం ఇండియా సీనియర్ జట్టులో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

అందరి దృష్టిని ఆకర్షించిన ఆయుష్ మాత్రే..

రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వగా, ఒక రోజు తర్వాత ఆదివారం మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు అవకాశం ఇచ్చింది. ఆయుష్ మాత్రే ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ముంబై ప్రమాదకరమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆయుష్ మాత్రే.. తన ఐపీఎల్ కెరీర్‌లో మూడో బంతికే సిక్స్ కొట్టడం ద్వారా తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆయుష్ ఇన్నింగ్స్ చిన్నదే అయినా, దీని ప్రతిధ్వని సెలెక్టర్ల చెవుల వరకు చేరింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..