MI Vs CSK: అరె పిల్లబచ్చాలు.! పెద్దపులి వచ్చేసిందిరోయ్.. ఇక ఆట వన్‌సైడే
ముంబై ఇండియన్స్ తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. మరి దాని గురించి డీటైల్స్ ఇప్పుడు చూసేద్దాం.. ఇది మీకోసమే ఓ లుక్కేయండి.

ఐపీఎల్ 2025 హాఫ్ స్టేజికి వచ్చింది. సుమారు 76 మ్యాచ్‌లు జరగాయి. టాప్ 4లో గుజరాత్, ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉండగా.. దిగువ నాలుగు స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఉన్నాయి. ఇక తటస్థగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పటిదాకా చిన్న జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాలు ఏలుతుంటే.. అనూహ్యంగా వరుసగా 4 విజయాలతో ముంబై ఇండియన్స్ టాప్‌నకు దూసుకొస్తోంది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారధ్యంలోని ముంబై ఇండియన్స్ మళ్లీ మునపటి ఫామ్ రాబట్టుకుంది. సరైన సమయంలో ఆ జట్టు పుంజుకుంది. ఆ టీం ప్రధాన బౌలర్ అయిన జస్ప్రిత్ బుమ్రా ఆగమనంతో.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్ వికెట్లతో విరుచుకుపడుతున్నారు. అలాగే బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రికెల్టన్, విల్ జాక్స్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా పరుగుల వరద పారించగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి భీకర ఫామ్‌లోకి వచ్చాడు.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 45 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 10 పరుగులు రాబట్టే వరకు కష్టం.. ఒకవేళ ఆ స్పీడ్ పెరిగితే అతడ్ని ఆపడం ప్రత్యర్ధుల తరం కూడా కాదని.. హార్దిక్ పాండ్యా కూడా ప్రెస్ మీట్‌లో తెలిపాడు. అటు 2024లో కూడా ముంబై ఇండియన్స్ తొలుత వరుసగా మ్యాచ్‌లు ఓడిపోగా.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కి వెళ్లింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని మళ్లీ ముంబై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగింట గెలిచి.. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది.
A maverick performance from our 𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤 𝐑𝐎 😎🔥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSK pic.twitter.com/xoXf5iEeRW
— Mumbai Indians (@mipaltan) April 21, 2025




