IPL 2025: ఐపీఎల్ అనుకుంటున్నారా లేక హాలిడే ట్రిప్ అనుకుంటున్నారా? ఆ ఇద్దరిపై వీరు భాయ్ ఫైర్!
ఐపీఎల్ 2025 సీజన్‌లో విదేశీ ఆటగాళ్ల ప్రదర్శనపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లియమ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల ఆట తీరుపై ఆయన హాలిడే మూడ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. కోట్లు వెచ్చించిన ఫ్రాంచైజీలను వీరి ప్రదర్శనలు నిరాశపరచాయంటూ ఆయన మండిపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలు అభిమానుల మద్దతు పొందుతున్నాయి, ఇది ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచేలా మారింది.

ఐపీఎల్ 2025 మధ్యలోనే దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో భారతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లంతా పాల్గొంటున్నారు. కొన్ని జట్లు అద్భుతంగా రాణిస్తున్నా, కొన్ని జట్లకు నిరాశలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రదర్శనపై కొందరు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిలో ప్రముఖుడైన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ చర్చలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లోని కొందరు విదేశీయుల ఆట ఆడలేదు, హాలిడే మూడ్‌లో వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్సీబీ తరపున ఆడుతున్న లియామ్ లింగ్‌స్టోన్, పంజాబ్ కింగ్స్ మ్యాప్ తరపున ఆడుతున్న గ్లెన్‌మాక్స్‌వెల్‌లపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ, “వాళ్లిద్దరూ ఇక్కడికి సెలవులు ఆస్వాదించేందుకే వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఆడటానికి వచ్చానన్న సంకల్పం లేదనిపిస్తుంది. వారు వస్తున్నారు, మజా చేస్తారు, ఆ తర్వాత వెళ్తారు. జట్టు కోసం పోరాడాలనే తపన, కోరిక కనిపించడం లేదు. గతంలో నేను ఎన్నో జట్లలో ఎందరో గురించి కలసి ఆడాను. వారిలో చాలామందిలో ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఉండేది. కానీ ఇప్పటికి ఈ రెండు ఉండాల్సిన అవసరం లేదు పట్టించుకోవడం లేదు,” అని వ్యాఖ్యానించాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శన పరిశిలిస్తే, అతను ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 8.20 కాగా, స్ట్రైక్ రేట్ 100కి పరిమితమైంది. ఒక బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న మ్యాక్సీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌కైనా ప్రభావవంతంగా ఆడలేకపోయాడు. అంతేకాదు, బౌలింగ్‌లోనూ అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇదే సమయంలో, లియామ్ లివింగ్‌స్టోన్ పరిస్థితి కూడా అంతే. అతడు ఆర్సీబీ తరపున 7 మ్యాచ్‌లు ఆడాడు, కేవలం ఒక అర్ధ సెంచరీతో మాత్రమే 87 పరుగులు చేశాడు. ఇతనిపైనా జట్టు పెద్దగా ఆశలు పెట్టుకుంది, కానీ అవి నెరవేరలేదు.
ఈ ఇద్దరు వ్యక్తులపై ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించారు. పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేయగా, ఆర్సీబీ లియం లివింగ్‌స్టోన్‌కు రూ.8.75 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం డబ్బుకు తగ్గ ప్రదర్శనను ఇద్దరూ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఫ్రాంచైజీల ఆశలు ఆవిరైపోయాయి. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులు సెవాగ్ అభిప్రాయానికి కూడా మద్దతుగా ఉన్నారు. ఈ కారణంగా తమ ప్రతిభను పూర్తిగా చూపించకపోవడం వలన జట్లకు నష్టం జరిగే అవకాశం ఉంది.
అంతిమంగా చెప్పాలంటే, ఐపీఎల్ లాంటి పోటీ లీగ్‌లో ప్రతి ఆటగాడి పాత్ర కీలకం. హాలిడే మూడ్‌లో కాకుండా, అసలు గెలవాలన్న తపనతో మైదానంలోకి దిగితేనే జట్టు విజయం సాధించగలదు. లేదంటే సెహ్వాగ్ లాంటి లెజెండ్స్ విమర్శలు తప్పవు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



