Video: లైవ్ మ్యాచ్‌లో కోహ్లీపై బాటిల్‌తో దాడి.. శ్రేయాస్‌తో గొడవే కారణమా?
Virat Kohli Post Match Incident: ఏప్రిల్ 20న జరిగిన RCB vs PBKS మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై దాడి జరగడం గమనార్హం.

Virat Kohli Viral Celebration RCB Win: ఆదివారం (ఏప్రిల్ 20) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. తన ట్రేడ్‌మార్క్ యానిమేటెడ్ సెలబ్రేషన్స్‌తో పంజాబ్ ఆటగాళ్లను ఏడింపించేలా చేశాడు. ఇందుకోసం వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.
ఆట ముగిసిన తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ని ఆటపట్టించేందుకు విరాట్ కోహ్లీ మైదానంలో చేసిన విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఛేజింగ్‌లో సత్తా చాటుతోన్న విరాట్ కోహ్లీ..
జితేష్ శర్మ సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించిన తర్వాత, విరాట్ కోహ్లీ అయ్యర్ వైపు చూస్తూ ఉడికించేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో అయ్యర్ ఎంతో బాధలో ఉన్నాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక దశలో, అయ్యర్ కోహ్లీ చేయితో నెట్టడం కూడా కనిపించింది. దీంతో కోహ్లీ సెలబ్రేషన్స్‌పై అయ్యర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీపై బాటిల్ విసిరిన అభిమాని..
&
View this post on Instagram
మైదానంలో విరాట్ కోహ్లీ చేష్టలకు చిరాకు పడింది శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే కాదని ఈ సంఘటన తెలియజేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ సూపర్‌స్టార్ కోహ్లీపై బాటిల్‌తో దాడి చేయడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. అంటే, స్టేడియంలో ఉన్న అభిమానుల్లో ఒకరికి కోహ్లీ ఇలా చేయడం నచ్చలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ, టీమిండియా దిగ్గజ ప్లేయర్‌పై ఇలా బాటిల్‌తో దాడిచేయడం మంచి పద్ధతి కాదని, కోహ్లీ కచ్చితంగా గౌరవించాల్సిందేనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కోహ్లీపై ఏదో విసిరినట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత కోహ్లీతోపాటు అతని ఆర్‌సీబీ సహచరులు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కోహ్లీ స్టేడియంలోకి ప్రవేశించే ముందు, ఒక అభిమాని కోహ్లీపై ప్లాస్టిక్ బాటిల్‌ను విసిరాడు. అయితే, అదృష్టవశాత్తూ, అది కోహ్లీకి తగలలేదు. దీంతో భారత మాజీ కెప్టెన్ ఒకసారి స్టాండ్స్ వైపు చూశాడు.
మ్యాచ్ గురించి చెప్పాలంటే, బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించి విజయపథంలోకి తిరిగి వచ్చింది. సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత రెండు రోజులకుకే ప్రతీకారం తీర్చుకుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








