AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: ఆ స్టార్ హీరో చెప్పినా క్లైమాక్స్ మార్చని పూరి.. చివరకు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు యూత్ లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యా్క్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు పూరి. కానీ కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు అంతగా సక్సెస్ కావడం లేదు. దీంతో ఇప్పుడు సరైన బ్రేక్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Puri Jagannadh: ఆ స్టార్ హీరో చెప్పినా క్లైమాక్స్ మార్చని పూరి.. చివరకు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2025 | 8:01 PM

Share

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలో సత్తా చాటారు. నటుడిగా వెండితెరపై తనను తాను చూసుకోవాలని సినీరంగంలోకి వచ్చిన పూరి.. దర్శకుడిగా మారి థియేటర్లలలో రఫ్పాడించారు. సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ అడుగుపెట్టి 25 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన తెరకెక్కించిన మొదటి చిత్రం బద్రి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. “ఏయ్ నువ్వు నంద అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటీ ?” అంటూ పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ డైలాగ్ యువతను ఓ ఊపు ఊపేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 20 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాదాపు 25 ఏళ్లల్లో ఎన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్స్, డిజాస్టర్స్ అందుకున్న పూరి మొదటి సినిమాకు ఎంతగానో కష్టపడ్డారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు పూరి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని సొంతంగా కథను సిద్ధం చేసుకున్నారు. ఛోటో కె. నాయుడి చొరవతో పవన్ కళ్యాణ్ ను కలిశారు పూరి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి తనకు కథ చెప్పాలని పవన్ కళ్యాణ్ నుంచి పూరికి కాల్ వచ్చింది. అంతేకాదు కేవలం అరగంట మాత్రమే సమయం ఇచ్చారట. తెల్లవారుజామునే పవన్ ఇంటికి వెళ్లిన పూరి కథ చెప్పడం స్టార్ట్ చేసి దాదాపు నాలుగు గంటలు చెప్పారట. ఇక కథ నచ్చిన పవన్.. ఈ సినిమా క్లైమాక్స్ మార్చాలని సలహా ఇచ్చారు. అయితే క్లైమాక్స్ మార్చమని పవన్ సూచించడంతో దాదాపు వారం రోజులు ప్రయత్నించారట. కానీ క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చినట్లు రావడం లేదట. వారం రోజుల తర్వాత పవన్ ను పూరి కలవగా.. క్లైమాక్స్ గురించి అడిగారట పవన్. ట్రై చేశాను.. కానీ నచ్చలేదను. అందుకే మార్చలేదంటూ పూరి చెప్పారట.

క్లైమాక్స్ తనకు ముందే నచ్చిందని.. కానీ మారుస్తావా లేదా ? అని చూశానని పవన్ చెప్పడంతో పూరి సంతోషించారట. బద్రీ సినిమాలో అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయి. ఇందులో బద్రిగా పవన్ నటన, స్టైల్, ఫైట్స్ అన్నీ మెప్పిస్తాయి. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..