AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు.. అసభ్య చేష్టలతో భయ పెట్టాడు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌

బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక సంఘటనలను ప్రతిరోజూ మనం వింటూనే ఉంటాము. సెలబ్రిటీలు లేదా నటీమణులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అందరితో పంచుకుంది.

Tollywood: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు.. అసభ్య చేష్టలతో భయ పెట్టాడు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 21, 2025 | 8:14 PM

Share

కొన్ని రోజుల క్రితం స్టార్ హీరోయిన్ శ్రీలీల కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆమె ఒక కార్యక్రమానికి వస్తుండగా జనంలో ఒక వ్యక్తి ఆమె చేతిని పక్కకు లాగాడు. ఈ సంఘటనతో శ్రీలీల షాక్ కు గురైంది. దీన్ని బట్టే చెప్పుకోవచ్చు సెలబ్రిటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదని. ఇప్పుడు మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తనకు జరిగిన ఒక షాకింగ్ సంఘటనను వివరించింది. కాలేజీలో చదువుతున్నప్పుడు ముంబై లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోన్న మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘ముంబై మహా నగరం మహిళలకు సురక్షితమని చాలా మందితరచుగా చెబుతారు. కానీ నేను ఈ విషయం గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు సొంత కారు, అలాగే డ్రైవర్ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ముంబై సురక్షితమేనా అని అడిగితే, నా సమాధానం బహుశా అవును అననే ఉంటుంది. కానీ నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రైలు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, నాకు ముంబై నగరం అస్సలు సురక్షితంగా అనిపించలేదు’

“ఆ సంఘటన నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. నేను నా ఇద్దరు స్నేహితులతో కలిసి లోకల్ రైలులో ప్రయాణిస్తున్నాను. అప్పుడు సమయం రాత్రి 9.30 గంటలు కావచ్చు. మేము ఫస్ట్ క్లాస్‌ కంపార్ట్ మెంట్ లో ప్రయాణిస్తున్నాం. ఆ సమయంలో కంపార్ట్‌మెంట్ ఖాళీగా ఉంది. కంపార్ట్‌మెంట్‌లో మేము ముగ్గురం తప్ప ఎవరూ లేరు. నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. అకస్మాత్తుగా, మా ముగ్గురిని చూసిన ఒక వ్యక్తి కిటికీ గ్రిల్ దగ్గరకు వ చ్చి అసభ్య చేష్టలు చేశాడు. ఆ తర్వాత ‘ఏక్ చుమ్మా దేగి క్యా?’ (నాకు ఒక ముద్దు ఇస్తావా?) అన్నాడు. మేము ముగ్గురం ఆశ్చర్యపోయాం. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో కూడా మాకు తోచలేదు. అతడి ప్రవర్తన చూసి నాకు భయమేసింది. ఈలోగా స్టేషన్ రావడంతో చాలామంది బోగీలోకి ఎక్కారు. దీంతో కాస్త ధైర్యం వచ్చి ఊపిరి పీల్చుకున్నాం. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించిన ఏ మహిళనైనా అడిగితే, ఆమె మీకు లెక్కలేనన్ని ఇలాంటి సంఘటనలు చెబుతారు. ఏ ప్రదేశం పూర్తిగా సురక్షితంగా అనిపించదు. సినిమాల్లోకి వచ్చాక కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. స్టార్ హోదా వచ్చినంత మాత్రాన కష్టాలు ఉండవనుకుంటే పొరపాటే. ప్రతిరోజు ఒకేలా ఉండదు. మనకి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని ముందుకు వెళ్లిపోవాలి గానీ బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు’ అని చెప్పుకొచ్చింది మాళవిక.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూలో మాళవిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి