‘నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది’.. ఇర్ఫాన్ చివరి మాటలు.. అందర్నీ ఏడిపిస్తున్నాయి..

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో ఇవాళ ఉదయం ముంబైలో తుది శ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ ఒక్కటే కాదు.. యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన తల్లి సయిదా బేగం(95) ఐదు రోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయారు. ఇక ఆమె చనిపోయిన ఐదు రోజులకు ఇర్ఫాన్ కన్నుమూయడం చాలా బాధాకరం. ఆయన […]

'నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది'.. ఇర్ఫాన్ చివరి మాటలు.. అందర్నీ ఏడిపిస్తున్నాయి..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:35 PM

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో ఇవాళ ఉదయం ముంబైలో తుది శ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ ఒక్కటే కాదు.. యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన తల్లి సయిదా బేగం(95) ఐదు రోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయారు. ఇక ఆమె చనిపోయిన ఐదు రోజులకు ఇర్ఫాన్ కన్నుమూయడం చాలా బాధాకరం. ఆయన తన చివరి క్షణాల్లో ‘నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది’ అని అన్నారట. కాగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇర్ఫాన్ అంత్యక్రియలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే ఆయన ఇటీవల ‘అంగ్రేజీ మీడియం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా థియేటర్లలో కాకుండా.. ఓటీటీ ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌కు ఇర్ఫాన్ అటెండ్ కాలేకపోయారు. దీనితో చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఆడియో క్లిప్‌ను పంపించారు. ఇక అదే ఆయన సినిమా గురించి మాట్లాడిన చివరి మాటలు.. ”అందరికి నా నమస్కారం, నేను మీ ఇర్ఫాన్‌ను. నేను మీతో ఉన్నా.. లేకపోయినా.. ఈ సినిమా ‘అంగ్రేజీ మీడియం’ నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. మీ ఆశీస్సులు నేను కోరుకుంటున్నా. దీన్ని మీ సినిమా అనుకుని ప్రమోట్ చేయండి. నా శరీరంలోకి అనుకోని అతిధి ప్రవేశించాడు. ప్రస్తుతం అతనితో యుద్ధం జరుగుతోంది. ఎవరు గెలుస్తారన్నది దేవుడే నిర్ణయించాలంటూ భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు.

Read More: 

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..