విజయ్ సినిమాకు నో చెప్పిన శ్రీలీల.. కారణమిదే
TV9 Telugu
04 May 2024
రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల.
ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందీ అందాల తార.
ఆ తర్వాత మహేశ్ బాబు, రామ్ పోతినేని, నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది శ్రీలీల.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ కన్నడ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే శ్రీలీల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమా గోట్ లో నటించేందుకు నో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇందులో శ్రీలీలది ఫుల్ లెంగ్త్ రోల్ కాదట. జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించేందుకే ఆమెను అడిగారట.
అయితే గోట్ దర్శక నిర్మాతల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందంట శ్రీలీల. దీనికి ఒక ప్రత్యేక కారణముందట.
ఇలా సింగిల్ సాంగ్‌తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తే అది కెరీర్ ఎదుగుదలకు పెద్దగా సహకరించిందని శ్రీలీల భావించిందట.
ఇక్కడ క్లిక్ చేయండి..