Baahubali: క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో బాహుబలి 1, 2 చిత్రాలు చాలా ప్రత్యేకం. అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆ రేంజ్ మూవీ రాలేదు. అయితే ఇప్పుడు బాహుబలి మళ్లీ వస్తుంది. అంటే రీరిలీజ్ అవుతుందని కాదు.. ఈసారి బాహుబలి యానిమేషన్ వస్తుంది. ఈ పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ తీసుకువస్తున్నారు. ఎస్ ! బహుబలి.. ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు.

Baahubali: క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

|

Updated on: May 04, 2024 | 10:25 PM

ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో బాహుబలి 1, 2 చిత్రాలు చాలా ప్రత్యేకం. అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆ రేంజ్ మూవీ రాలేదు. అయితే ఇప్పుడు బాహుబలి మళ్లీ వస్తుంది. అంటే రీరిలీజ్ అవుతుందని కాదు.. ఈసారి బాహుబలి యానిమేషన్ వస్తుంది. ఈ పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ తీసుకువస్తున్నారు. ఎస్ ! బహుబలి.. ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ రానుందంటూ ట్వీట్ చేశాడు. “అతడి పేరును మాహిష్మతి ప్రజలు జపిస్తుంటే.. తిరిగి రాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు. యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రానుంది” అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు జక్కన్న. అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలను ప్రకటించలేదు. ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈయానిమేటేడ్ సిరీస్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారా ? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us