RCB vs GT, IPL 2024: దంచికొట్టిన డుప్లెసిస్.. ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరం

Royal Challengers Bengaluru vs Gujarat Titans: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శనివారం ( మే04) రాత్రి జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విధించిన 148 పరుగుల లక్ష్యాన్నిఆర్‌సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ అవకాశాలను నిలబెట్టుకోగలిగింది.

RCB vs GT, IPL 2024: దంచికొట్టిన డుప్లెసిస్.. ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరం
Royal Challengers Bengaluru
Follow us

|

Updated on: May 05, 2024 | 12:02 AM

Royal Challengers Bengaluru vs Gujarat Titans: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శనివారం ( మే04) రాత్రి జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విధించిన 148 పరుగుల లక్ష్యాన్నిఆర్‌సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ అవకాశాలను నిలబెట్టుకోగలిగింది. మరోవైపు గుజరాత్‌ ఓటమితో ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి మాజీ కెప్టెన్లు ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ గట్టి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ అద్భుతంగా, దూకుడుగాబ్యాటింగ్ చేశారు. ఫాఫ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫాఫ్ 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అయితే ఫాఫ్ ఔటైన తర్వాత ఆర్సీబీ పతనమైంది. ఆర్సీబీ కేవలం 25 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్ 1, రజత్ పాటిదార్ 2, గ్లెన్ మాక్స్‌వెల్ 4 మరియు కామెరాన్ గ్రీన్ 1 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ లు RCBని విజయతీరాలకు చేర్చారు. దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేశాడు. గుజరాత్ తరఫున జాషువా లిటిల్ ఒక్కడే 4 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

అంతకు ముందు ఆర్‌సిబి టాస్ గెలిచి గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ నమ్మకాన్ని RCB బౌలర్లు వమ్ము చేయలేదు . ఆర్సీబీ 19.3 ఓవర్లలో గుజరాత్‌ను 147 పరుగులకు ఆలౌట్ చేసింది. షారూఖ్ ఖాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా 35 పరుగులు జోడించాడు. డేవిడ్ మిల్లర్ 30 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 18 పరుగులు, విజయ్ శంకర్ 10 పరుగులు చేశారు. ఆర్‌సీబీ తరఫున మహ్మద్‌ సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయకుమార్‌ వైశాఖ్‌ తలో 2 వికెట్లు తీశారు. కెమరూన్ గ్రీన్, కర్ణ్ శర్మ తలా 1 వికెట్ పడగొట్టారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, ఆకాష్ దీప్, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సందీప్ వారియర్, శరత్ BR, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..