Rajeev 

అదరగొడుతున్న అంజలి.. లేటెస్ట్ పిక్స్ వైరల్ 

04 May 2024

షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 

తెలుగులోనూ తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. 

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తూ అదరగొడుతోంది అంజలి.

ఇటీవలే గీతాంజలి 2 సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని టాక్.

ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది అంజలి.

అటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది అంజలి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.