Anil Kumar
ట్రెండ్ ని ఇంతలా ఫాలో అవుతుంది అనుకోలేదు.? అవికా న్యూ ఫొటోస్ వైరల్..
04 May 2024
బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకొని.. వెండితెరపైకి హీరోయిన్ గా అడుగుపెట్టింది నటి అవికా గోర్.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారింది.
తన తొలి సినిమా పెద్ద సక్సెస్ అయ్యినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం గుర్తింపు రాలేదు కానీ అవకాశాలు వెల్లువెత్తయి.
తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్గా మాత్రం స్టార్ రేంజ్ సొంతం చేసుకోలేకపోయింది అవికా గోర్.
ఈ మధ్య వరసబెట్టి వెబ్ సిరీస్ లు చేసింది.. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ స్టార్ డమ్ రాలేదు.
ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ 1920:Horrors of the Heart అనే సినిమా చేసింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టీవ్ గా ఉంటూ తనదైన అందం , న్యూ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్.. క్యాలి ఫ్లవర్ టైపు లో ఉన్న ఆ డ్రెస్ అవికా వేసుకోగా హాట్ టాపిక్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి