సొంత పార్టీ నేతకు షాకిచ్చిన జగన్.. ఆ ఎంపీ భర్తపై క్రిమినల్ కేసు నమోదు..

కరోనా కాలంలో పేదలు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కె. సత్యవతి భర్త విష్ణుమూర్తి అక్రమ మార్గంలో వినియోగించినందుకు గానూ విశాఖ జిల్లా అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి భర్త డాక్టర్ విష్ణుమూర్తీ అధ్వర్యంలో వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు నడుస్తోంది. ఇప్పటికే నియోజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఈ ట్రస్టుకు కరోనా కాలంలో నిత్యావసరాలు అందడం లేదని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వ రేషన్ దుకాణాలకు […]

సొంత పార్టీ నేతకు షాకిచ్చిన జగన్.. ఆ ఎంపీ భర్తపై క్రిమినల్ కేసు నమోదు..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 8:20 PM

కరోనా కాలంలో పేదలు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కె. సత్యవతి భర్త విష్ణుమూర్తి అక్రమ మార్గంలో వినియోగించినందుకు గానూ విశాఖ జిల్లా అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి భర్త డాక్టర్ విష్ణుమూర్తీ అధ్వర్యంలో వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు నడుస్తోంది. ఇప్పటికే నియోజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఈ ట్రస్టుకు కరోనా కాలంలో నిత్యావసరాలు అందడం లేదని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన 500 కేజీల బియ్యాన్ని నేరుగా ట్రస్ట్ కార్యాలయానికి తరలించారు. ఇక దీనిపై కేసు నమోదు చేశారు.

ఎంపీ భర్త అక్రమంగా బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదు అందటంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టారు. అక్రమంగా లారీని నిల్వ ఉంచినందుకు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి.. డీలర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, తన భార్యకు, వివేకానంద ట్రస్టుకు ఎటువంటి సంబంధం లేదని ఎంపీ భర్త విష్ణుమూర్తి తెలిపారు. ఇక ఈ విషయం సీఎం జగన్ వరకు వెళ్లడంతో.. ఆయన సొంత పార్టీ నేతలైనా వదిలిపెట్టేది లేదని.. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.

Read More: 

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..

‘నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది’.. ఇర్ఫాన్ చివరి మాటలు.. అందర్నీ ఏడిపిస్తున్నాయి..