AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్..ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.. ఉదయం నుంచి రాత్రి వరకు..

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వీళ్లు ఆఫీసులకు త్వరగా చేరుకునే విధంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఇవి ఉదయం నుంచి రాత్రి వరకు తిరగనున్నాయి. కొత్తగా రెండు రూట్లలో ఈ స్పెషల్ బస్సులను తీసుకొచ్చారు. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

Hyderabad: హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్..ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.. ఉదయం నుంచి రాత్రి వరకు..
Tsrtc Special Buses
Venkatrao Lella
|

Updated on: Dec 23, 2025 | 10:54 AM

Share

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు ఈ బస్సులు తిప్పనుంది. గర్‌లక్ష్మి ఇన్పోబాన్ పేరుతో టెక్కీలు తమ ఆఫీసులకు వెళ్లేందుకు వీలుగా స్పెషల్ బస్సులను నడపనుంది. ఎల్‌బీనగర్, హయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి ఐటీ కారిడార్‌కు ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు తిరుగుతూనే ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. బస్సు నెంబర్లు, రూట్ల వివరాలు, ఏయే ప్రాంతాల మీదుగా వెళ్తాయనే పూర్తి వివరాలను విడుదల చేశారు.

156/316, 300/316 రూట్ బస్సులను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో 156/316 రూట్ బస్సులు ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, నార్సింగ్, కోకాపేట, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ, ఐఐఐటీ ఏరియాలను కవర్ చేస్తూ గచ్చిబౌలి వరకు చేరుకుంటాయి. ఇక 300/316 రూట్ బస్సులు హయత్ నగర్ నుంచి ప్రారంభమవుతాయి. ఎల్బీనగర్, సాగర్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, హైదర్ గూడ, నార్సింగ్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, వేక్ రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటాయి.

ఇప్పటికే ఐటీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ అనేక ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరంలోని నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులు సులువుగా ఆఫీసులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రెండు, మూడు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా బస్సులను ప్రవేశపెడుతోంది. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు సమయం ఆదా అవుతోంది. దీన వల్ల సులువుగా తమ ఆఫీసులకు చేరుకుంటున్నారు. రానున్న రోజుల్లో నగరంలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. వీటిల్లో కొన్ని బస్సులను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు నడపనున్నారు. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు మరింత మేలు చేకూరనుంది. మెట్రో కొన్ని ప్రాంతాలకు అందుబాటులోకి లేదు. ఇక క్యాబ్ ఛార్జీలు చూస్తే అధికంగా ఉంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ఛార్జీలు ఉండటంతో ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Follow Us
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ