AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

ఈ కరోనా కారణంగా పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అన్నీ మళ్లీ షెడ్యూల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు ఏప్రిల్ మొదటి తేదీ వరకూ..

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 8:24 AM

Share

కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో.. మార్చి 31వ తేదీవరకూ రెండు తెలుగు రాష్ట్రాలను లాక్‌డౌన్ చేశారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసిన సందర్భంగా పీఎం ప్రధాని మోదీతో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇదే రకంగా మరికొన్ని రోజులు దిగ్భందంలో ఉంటే కరోనా మహమ్మారిని తరిమేయెచ్చని పిలుపునిచ్చారు. కాగా ఇదివరకే.. మార్చి 15వ తేదీ నుంచి జన సంచారం ఎక్కువగా ఉండే.. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఇలా అన్నింటినీ ముందుగానే బంద్ చేయించారు. అలాగే స్వచ్ఛందంగా సినిమా షూటింగ్స్‌ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలుగు చిత్ర సీమ కూడా ప్రకటించింది.

అయితే ఇప్పటికే వివిధ పారిశ్రామిక రంగాలు ఉత్పత్తి లేక కుదేలవుతున్నాయి. ఈ కరోనా కారణంగా పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అన్నీ మళ్లీ షెడ్యూల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు ఏప్రిల్ మొదటి తేదీ వరకూ షూటింగ్స్ వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ.. వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఒకవేళ ఈ కరోనా తీవ్రత కట్టడిలోకి రాకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలో దాదాపు చాలా మంది వీటిపైనే ఆధారపడి ఉంటారు. ఇక షూటింగ్‌ల సమస్య అలా ఉంటే.. విడుదల కావాల్సిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. ఏప్రిల్‌లో కూడా కరోనా అదుపులోకి రాకపోతే.. విడుదల కావాల్సిన సినిమాల తేదీలు ఇంకా వెనక్కు వెళ్లే అవకాశం ఉ:ది. ఈ తాజా పరిణామాలతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల పరిస్థితి మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా మారింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా బంద్‌తో పాటు సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌లను మరికొన్ని రోజులు వాయిదా వేయాల్సిందిగా అధికారులు కోరుతున్నట్లు సమాచారం.

Read more also: నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్