AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సామాజిక దూరం’పై సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన సీపీఐ నేత

'సామాజిక దూరం'పై సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు సీపీఐ నేత. కరోనా మహమ్మారి విజృంభిస్తోనన వేళ.. ప్రపంచమంతా పాటిస్తున్న ఒకే ఒక్క మంత్రం సామాజిక దూరం. దీనితోనే కరోనాను కట్టడి చేయవచ్చని ప్రభుత్వాలు..

'సామాజిక దూరం'పై సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన సీపీఐ నేత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2020 | 2:15 PM

Share

‘సామాజిక దూరం’పై సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు సీపీఐ నేత. కరోనా మహమ్మారి విజృంభిస్తోనన వేళ.. ప్రపంచమంతా పాటిస్తున్న ఒకే ఒక్క మంత్రం సామాజిక దూరం. దీనితోనే కరోనాను కట్టడి చేయవచ్చని ప్రభుత్వాలు కూడా చెబుతూనే ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్ అనే పదాన్ని తెలుగులో సామాజిక దూరం అని అంటున్నాం. అందరూ ఒకే చోట ఉంటే వ్యాధి మరింత విజృంభించే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. విదేశాల్లో కూడా దీన్నే పాటిస్తున్నారు.

అయితే సామాజిక దూరం అనే పదం వాడటం సరికాదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రంగా ప్రబలుతోన్న నేపథ్యంలో అధికారులు, మీడియా మాధ్యమాల వారు సామాజిక దూరం అనే పదాన్ని విరివిగా వాడుతున్నారని రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. సామాజిక దూరం అనే పదం చాందసవాదులు కులాన్ని అవమానించడానికి వాడిన పదమని.. దీనికి బదులుగా ‘భౌతిక దూరం’ అనే పదాన్నిఉపయోగించాలని అన్ని ప్రభుత్వ శాఖలు ఆదేశించాలని రామకృష్ణ లేఖలో కోరారు. అలాగే ప్రభుత్వ ప్రకటనలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా భౌతిక దూరం అనే పదాన్ని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాని చెప్పారు రామకృష్ణ.

ఇవి కూడా చదవండి:

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

 ఫ్లాష్‌న్యూస్: దేశ వ్యాప్తంగా 2,301కి చేరిన కరోనా కేసులు..

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం