వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..
వికారాబాద్ జిల్లాలో ఓ పొలాన్ని చదును చేస్తుండగా భారీ సంఖ్యలో వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ సంగతిని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్మకన్నె గ్రామంలో వెంకట్రామి రెడ్డి సోమవారం తన పొలాన్ని..

వికారాబాద్ జిల్లాలో ఓ పొలాన్ని చదును చేస్తుండగా భారీ సంఖ్యలో వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ సంగతిని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్మకన్నె గ్రామంలో వెంకట్రామి రెడ్డి సోమవారం తన పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు దొరికాయి. దీంతో ఆ పొలం యజమాని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. అక్కడున్నవారంతా వాటాల ప్రకారం నాణేలను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ సంగతి గ్రామమంతా పాకిపోయింది. ఇదికాస్తా పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారుల చెవిన పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అసలు విషయం ఏంటని ఆరా తాశారు. ఆ పొలం వెంకట్రామి రెడ్డిదని తెలుసుకుని అతన్ని విచారించగా.. అది నిజమేనని ఒప్పుకున్నాడు. అనంతరం అతని దగ్గర నుంచి కొన్ని, మరికొందరి నుంచి కొన్ని.. కలిపి మొత్తం 141 వెండి నాణేలను స్వాధీనం చేసుకన్నారు. అవి రెండు వందల ఏళ్ల కిందట చలామణిలో ఉన్న నాణేలుగా.. రెవెన్యూ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం
ప్రభాస్ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే
లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం
కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..
అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం