దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే
కరోనా ఎక్కువగా ప్రబలుతున్న రాష్ట్రాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించారు అధికారులు. కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానాలుగా..

రోజురోజుకీ దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నెమ్మదిగా వందల్లో నుంచి వెలల్లోకి చేరింది సంఖ్య. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం భారత్‌లో 1,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 50 మంది మరణించారు. అయితే కరోనా ఎక్కువగా ప్రబలుతున్న రాష్ట్రాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించారు అధికారులు. కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానాలుగా భావిస్తున్న పది ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అవి:
1. ఢిల్లీలోని నిజాముద్దీన్, దిల్హాద్ గార్డెన్ 2. రాజస్థాన్‌లోని భిల్వారా 3. ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడా, మీరట్ 4. గుజరాత్‌లోని అహ్మదాబాద్ 5. మహారాష్ట్రలోని ముంబాయి, పూణె 6. కేరళలోని కాసరగోడ్, పథనంథిట్ట
దేశంలో ఎక్కువ కేసులు ఈప్రాంతాల్లోనే నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే ఈ రాష్ట్రాల్లో ఇంకా కఠిన చర్యలు అమలు పరచబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు. ఎలాంటి అనుమానాలున్నా.. వెంటనే ప్రభుత్వం తెలిపిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. అలాగే కరోనా వచ్చినట్లు అనుమానం ఉంటే.. స్వచ్ఛందంగా వచ్చి క్వారంటైన్‌కి రావాలన్నారు. ఇలా చేయడం వల్ల మీతో పాటు కుటుంబసభ్యులను, చుట్టుప్రక్కల వారిని కూడా సేవ్ చేసినట్టు అవుతుందన్నారు. ఇక అలాగే..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం
కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..
అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం
ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్ కూడా
మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ