మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
ఉరుకుల పరుగుల జీవితంలో ఇల్లు, ఉద్యోగ నిర్వహణలో తీరిక లేని సమయం గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒత్తిడితో అయితేనేమి.. మరో కారణంతో అయితేనేమి చాలామంది జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా.. మన అలవాట్లు, నిర్లక్ష్య వైఖరి మన మెమరీపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు తెలియకుండానే వీటి ప్రభావం మనపై తీవ్రంగా ఉంటుందని, దీనిని ఏమాత్రం గుర్తించకుండా మనకు తెలియకుండానే వాటిని అనుసరిస్తూ ఉంటామని చెబుతున్నారు. మనం చేసే ఆ పొరపాట్లు, అలవాట్లను గుర్తించి, మార్చుకోవడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపర్చుకోవచ్చని సూచిస్తున్నారు.
శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న వివరాలు ప్రకారం… రాత్రి నిద్రకు ముందు సోషల్ మీడియా వాడకం జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చాలా మంది రాత్రి బెడ్ పైకి చేరగానే… ఫోన్ చేతిలోకి తీసుకుని ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటివాటితో గడుపుతుంటారు. కానీ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి రంగు కాంతి.. మనశరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుందని, దీంతో నిద్రసరిగా పట్టదని, ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయాలంటే, బెడ్ పైకి చేరడానికి కనీసం గంట ముందు నుంచే ఫోన్ స్క్రీన్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోవడానికి మరో ముఖ్య కారణం.. మల్టీటాస్కింగ్. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం. కొందరు ఒకే సమయంలో వేర్వేరు పనులు చేస్తూ ఉంటారు. ఇది కొంత వరకు మంచిదే అయినా… తరచూ ఇలా చేస్తుంటే మాత్రం ఏకాగ్రత, మెమరీపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడుపై ఎక్కువ ఒత్తిడి పడి, కొత్త జ్ఞాపకాలు స్టోర్ అవడానికి సమస్యగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఏప్రిల్ 1 నుంచి UPI పేమెంట్స్ బంద్ వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
