అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్.. ట్రంప్ ఏం చేశారంటే?
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్ధుల మొదటి ఎంపిక అమెరికా. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇందులో భారతీయులు ముందుంటారు. ఒక్క భారత్‌నుంచే కాదు చాలా దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల సంఖ్యకు అమెరికా సర్కారు భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41శాతం వీసా దరఖాస్తులను తిరస్కరించింది.
దశాబ్దం క్రితంతో పోలిస్తే F-1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. 1.73లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అప్పటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. అయితే, దేశాలవారీగా తిరస్కరణకు గురైన వారి సంఖ్యను అమెరికా వెల్లడించలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఏప్రిల్ 1 నుంచి UPI పేమెంట్స్ బంద్ వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు