ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతూ.. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తోందా అనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్కపిల్లను ఎత్తుకొచ్చిన ఓ కోతి దాన్ని కన్నబిడ్డలా సాకుతున్న వైనాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని కోతి ఎక్కడి నుంచి తెచ్చిందో కానీ ఓ కుక్కపిల్లను తెచ్చుకుంది. దానిని తన బిడ్డలాగే ఎంతో ప్రేమగా చేసుకుంటోంది. ఆ కుక్కపిల్లను పట్టుకొని చెట్ల కొమ్మలపైన అటూ ఇటూ గెంతుతోంది. నేలపైన నడిచే ఆ కుక్కపిల్లను చెట్లపైకి తీసుకెళ్లి లాలిస్తోంది. ఈ క్రమంలో ఆ కుక్కపిల్లకు కోతిని పట్టుకోవడం రావట్లేదు. అది ఎక్కడ జారి పడిపోతుందో అనిపిస్తుంది. కానీ కోతి మాత్రం దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని కాపాడుకుంటుంది. ఆ కుక్కపిల్లలో తన సొంత బిడ్డను చూసుకుని మురిసిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ మొబైల్‌లో వీడియో తీసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. స్వచ్ఛమైన తల్లి ప్రేమ అని కొందరు.. ఈ కోతికి అల్లరి చేయడమేకాదు.. ప్రేమించడమూ తెలుసు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 4 లక్షలమందికి పైగా లైక్‌చేశారు.
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

