పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకోవడంతో దారుణానికి ఒడిగట్టింది. శునకాన్ని వెంట తీసుకునేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతించలేమని ఎయిర్‌పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటికి ఒంటరిగా వచ్చి విమానం ఎక్కింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి ఉంటుందని అధికారులు భావించారు. అయితే, విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూంలో శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి ఉండటం కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుందీ ఘటన.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న అలిసన్ లారెన్స్ అనే మహిళ.. తెల్లటి షనాసర్ కుక్కను వెంటపెట్టుకొని ఫ్లోరిడా ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. కొలంబియా విమానం ఎక్కేందుకు వెళ్తుండగా.. అలిసన్ ను అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలు ఆమె వద్ద లేకపోవడంతో అభ్యంతరం చెప్పారు. దీంతో అలిసన్ బాత్ రూమ్ కు వెళ్లి తన పెంపుడు శునకాన్ని నీళ్లలో ముంచి చంపేసింది. అనంతరం ఏమీ జరగనట్టు మామూలుగా వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయింది. బాత్ రూమ్ లో శునకం కళేబరం బయటపడడంతో మెడకు ఉన్న పట్టీపై ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమాని అలిసన్ గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన ఘోరం బయటపడింది. దీంతో జంతు హింస నేరం కింద ఇల్లినోయీలోని లేక్ కౌంటీలో అలిసన్ ను అరెస్టు చేశారు.
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!