పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు
ఓ చోట పొదల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న కొన్ని గుడ్లు కనిపించడంతో .. అవి ఏమై ఉంటాయా అని అనుమానం వచ్చిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ సిబ్బంది అక్కడకు చేరుకొని వాటిని తీసుకెళ్లి భద్రంగా ఓ చోట ఉంచారు. కొన్ని రోజులకు వాటిలోంచి బయటకు వచ్చిన పిల్లలను చూసి అధికారులు షాకయ్యారు. కొన్నాళ్ల క్రితం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ప్రాంతంలో స్థానికులు ఈ గుడ్లను గుర్తించారు.
స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గుడ్లను తీసుకువెళ్లి అటవీశాఖ కార్యాలయంలోని ఓ గదిలో భద్రపరిచారు. జీవం పోసుకునేందుకు వీలుగా గుడ్లను ఇసుక డబ్బాలలో భద్రపరిచారు. కొన్నాళ్లకు వాటినుంచి దాదాపు 80 పాము పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసి అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. నీటి కుంట జాతికి చెందిన పాములు కావడంతో.. అవి ప్రమాదకరమైని కావని గుర్తించిన అటవీశాఖ అధికారులు కొన్ని పాములు కంభం చెరువులో మరికొన్నింటిని దోర్నాల చెరువులో విడిచిపెట్టారు. ప్రకృతిని పరిరక్షించడంలో ముఖ్యపాత్ర పోషించే పాములను అధికారులు సంరక్షించడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
