Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్

కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్

Samatha J

|

Updated on: Mar 28, 2025 | 10:14 AM

కాలేజ్‌ క్యాంపస్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది. ఊహించని ఈ పరిణామానికి విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి సంచారం తీవ్ర కలకలం రేపింది. రోడ్డుదాటి నేరుగా కాలేజ్‌ క్యాంపస్‌లోకి వచ్చిన మొసలిని చూసి స్థానికులు, విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ భారీ మొసలిని చూసి అందరూ తలోదిక్కూ పరుగులు తీశారు.

 సమీపంలోని సరస్సు నుంచి క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఈ మొసలిని చూసి విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనలకు గురయ్యారు.అంత పెద్ద మొసలి కాలేజ్‌ క్యాంపస్‌లోకి రావడంతో కొందరు విద్యార్ధులు మాత్రం ధైర్యం చేసి తమ మొబైల్స్‌లో మొసలి ఎంట్రీ ఇచ్చిన దృశ్యాలను రికార్డు చేశారు. దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అది కాస్తా వైరల్‌ కావడంతో స్థానిక పోలీసులు, జంతుప్రేమికులు అక్కడికి చేరుకున్నారు. మొసలి కారణంగా ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా, ఎవరిపైనా మొసలు ఎటాక్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మొసలి తనదారిన తాను పావై సరస్సులోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐఐటీ బాంబేకి మొసలి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానించగా, పావై సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు సాధారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏప్రిల్‌ 1 నుంచి UPI పేమెంట్స్‌ బంద్‌ వీడియో

ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో

పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!

పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు