ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త.. ఇవన్నీ గుండెపోటుకు ప్రారంభ లక్షణాలే!
samatha
28 march 2025
Credit: Instagram
ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది గుండెపోటుకు గురి అవుతున్నారు.
అందువలన వైద్యులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మంచి పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట.
వాటిని గుర్తుపెట్టుకోవడం వలన హార్ట్ ఎటాక్ సమస్య నుంచి బయటపడవచ్చునంట. కాగా, అసలు గుండెపోటు వచ్చే ముందు ఎలాటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఎలా గుర్తించవచ్చునో ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్ తినే వారు, అలాగే వ్యాయామం చేయని వారిలో ఎక్కుగా హార్ట్ ఎటాక్ వచ్చే అకాశాం ఉంటుంది.
అంతే కాకుండా హైబీపీ, అధికరక్తపోటు ఉన్న వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. కాగా, గుండెపోటు వచ్చేముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయంట.
గుండెపోటు వచ్చేముందు అలసట ఎక్కువగా అనిపిస్తుంది. ఏ పని చేయకపోయినా విపరీతంగా చెమటలు పట్టడం, శరీరానికి తగిన శక్తి అందకపోవడం, చాలా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గుండెపోటు వచ్చే ముందు మీ హృదయస్పందనలో కూడా మార్పు వస్తుంది. గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చినప్పుడు,70 నుంచి 72 సార్లు గుండె కొట్టుకోకపోయినట్లు అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.
పదే పదే ఛాతీలో నొప్పి వచ్చినట్లుగా అనిపించడం, భుజాలు, చేతులు, వీపుకు కూడా ఆ నొప్పి వ్యాపిస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గుండెపోటుకు సంకేతం అంటున్నారు నిపుణులు