పాములును చూస్తే చాలు చాలా మంది భయపడిపోతుంటారు. ఇక ఇవి ఎక్కువగా ఇళ్లల్లో చాలా చిత్తడిగా ఉండే ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి.
పాము కాటు వేస్తే చాలు త్వరగా చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కొన్ని జంతువులు మాత్రం పాము కాటు వేసినా, చనిపోవు అంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
పాముతో పోరాడే వాటిలో ముంగిస ముందుంటుంది. ఇది పాము కాటు వేసినా చనిపోదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రత్యేక నిరోధక శక్తి వలన పాము కాటు దీనిపై ఎక్కువ ప్రభావం చూపదు.
పాముకాటు వేసినా చనిపోని జంతువుల్లో ఓపోస్సమ్ కూడా ముందుంటుంది. దీనికి పాము విషాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.
అలాగే మీర్ కట్ అనే ముంగిస జాతికి చెందిన జంతవులకు పాము విషాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని పాము కాటేసినా ఎలాంటి ప్రాణాపాయం ఉండదు.
అడవి పందులలో కొన్నింటికి పాము కాటు ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. జెనెటిక్ మ్యూటేషన్ జరిగిన కొన్ని అడవి పందులకు పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుందంటున్నారు నిపుణులు.
ముల్లపంది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే కనిపిస్తుంటాయి. అయితే ఈ జంతువు కూడా సహజంగానే పాము విషాన్ని తట్టుకో గలికే శక్తిని కలిగి ఉంటుందంట.
హానీ బ్యాడ్జర్ కూడా పాము విషాన్ని తట్టుకోగలదంట. దీని శరీరం చాలా దట్టంగా ఉండటం వలన పాము విషం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు, అంతే కాకుండా విషాన్ని కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంటుందంట.