లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం

ఈ లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చదువుకున్న వారి కంటే చదువులేని వారే లాక్‌డౌన్ పట్ల అవగాహనతో ఉన్నట్లు..

లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 9:20 AM

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి.. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు కూడా విధించింది. దీంతో లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఏదో ఒక వంక పెట్టుకుని బయట తిరుగుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లకు పోలీసులు లాఠీ దెబ్బలను రుచి చూపిస్తున్నారు. మరికొందరు పోలీసులైతే.. ఎంతో గౌరవంగా బయటకు రాకూడదని దణ్ణం పెట్టి మరీ బతిమలాడుతున్నారు. ఇంత చెప్పిన తరువాత కూడా కొంతమంది వ్యక్తులు పోలీసులపైనే తిరగబడుతున్నారు. వీటికి సంబంధించిన పలు వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చదువుకున్న వారి కంటే చదువులేని వారే లాక్‌డౌన్ పట్ల అవగాహనతో ఉన్నట్లు సర్వేలో తేలింది. సర్వే రిపోర్టును తెలంగాణ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి’.. అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్