Dhurandhar 2 Movie: ‘ధురంధర్ 2’ కూడా వచ్చేస్తోంది.. ఈసారి తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?
డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' సినిమా ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే వీక్షించడానికి అందుబాటులో ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్ నుంచే బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్ రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా గురించి కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ, ఇప్పుడు రికార్డు వసూళ్లు వస్తున్నాయి. దక్షిణాదిలోనూ ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ‘ధరుంధర్’ సినిమా హిందీ భాషలో మాత్రమే వీక్షించడానికి అందుబాటులో ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్ నుంచే బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో హైప్ రావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తద్వారా ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
కాగా ఈ మధ్యన కొన్ని హిందీ సినిమాలు దక్షిణాదిలో బాగా ఆడలేదు. ఉత్తర భారతదేశంలో సూపర్ హిట్ అయిన ‘బ్రహ్మాస్త్ర’, ‘పఠాన్’ వంటి కొన్ని చిత్రాలు సౌత్ లో పెద్దగా కలెక్షన్లు సాధించలేదు. కానీ ‘ధురంధర్’ అలా కాదు, ఇప్పుడీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ కారణంగా, ‘ధురంధర్ 2’ని దక్షిణ భారత భాషలలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ‘ధురంధర్’ లో రణ్‌వీర్ సింగ్ గూఢచారి పాత్రలో నటించారు. యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో అతని నటనకు చాలా ప్రశంసలు అందుకుంది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి టాప్ స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరితో పాటు ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ ప్రియురాలిగా ఒకప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ నాన్న మూవీ ఫేమ్ సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.
#BreakingNews… ‘DHURANDHAR 2’ TO RELEASE IN HINDI + *ALL* SOUTH INDIAN LANGUAGES… The storm is set to return… This time, everywhere.#Dhurandhar2, slated for a grand #Eid release on 19 March 2026, will release *simultaneously* in #Hindi, #Telugu, #Tamil, #Kannada, and… pic.twitter.com/4xuRckoGjG
— taran adarsh (@taran_adarsh) December 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




