AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Movie Review : ఈషా మూవీ రివ్యూ.. హెబ్బా పటేల్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే..

ఈ రోజుల్లో హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే జోనర్ లో వచ్చిన మరొక సినిమా ఈషా. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాల తర్వాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేసిన సినిమా ఇది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Eesha Movie Review : ఈషా మూవీ రివ్యూ.. హెబ్బా పటేల్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే..
Eesha Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 8:43 AM

Share

మూవీ రివ్యూ: ఈషా

నటీనటులు: త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, పృద్వి, మైమ్ మధు తదితరులు

సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని

ఎడిటింగ్: వినయ్ రామస్వామి

సంగీతం: RR ధృవన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ మన్నే

సమర్పణ: బన్నీ వాస్, వంశీ నందిపాటి

ఈ రోజుల్లో హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే జోనర్ లో వచ్చిన మరొక సినిమా ఈషా. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాల తర్వాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేసిన సినిమా ఇది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

కళ్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హనుమంతు) నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందులో వినయ్, అపర్ణ పెళ్లి చేసుకుంటారు. నయనను కళ్యాణ్ ప్రేమిస్తుంటాడు. నలుగురు తమ ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో దొంగ బాబాలు, మూఢనమ్మకాల పేర్లతో మోసం చేస్తున్న వాళ్ల అసలు గుట్టు బయటపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అమెరికాలో మానసిక వైద్యుడిగా ఉండి, భార్య మరణం తర్వాత ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తిన ఆది దేవ్ (పృథ్వీ రాజ్) గురించి తెలుస్తుంది. అతడిని ఎక్స్ప్రెస్ చేయాలని నలుగురు వెళుతున్న టైం లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యవతి (మైమ్ మధు) ఆ నలుగురిని వెంబడిస్తుంది. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లకు పుణ్యవతికి ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:

హారర్ సినిమాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. కథ లేకపోయినా.. కథనం ఉంటే క్షమిస్తారు ఆడియన్స్.. ఈషా విషయంలో దర్శకుడు శ్రీనివాస్ మన్నె అదే నమ్ముకున్నాడు. సినిమాలో కథ అంటూ ఏమీ ఉండదు.. ఒకే చోట జరుగుతుంది. దయ్యాలు భూతాలు లేవు అని నమ్మే ఒక బ్యాచ్.. వాళ్లకు అనుభవం కలిగించడం కోసం ఒక స్వామీజీ.. ఉండడానికి ఒక పాడుబడిన బంగాళా.. అక్కడ ఆత్మలు.. అవి పెట్టే భయాలు ఇదే ఈ సినిమా కథ. కాకపోతే ప్రతీ సీన్‌లో భయపెట్టాలనే చూసాడు.. అక్కడక్కడా బాగానే సక్సెస్ అయ్యాడు కూడా. డైరెక్టర్ 40 పర్సెంట్ రాసుకుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ 60 శాతం న్యాయం చేసాడు. 2 గంటల నిడివే ఉన్నా.. కాస్త ల్యాగ్ ఫీల్ అయితే కచ్చితంగా వస్తుంది.. ఇంటర్వెల్ వరకు స్లోగానే వెళ్లిన కథనం.. సెకండాఫ్‌లో ఊపందుకుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల సినిమా అదిరిపోయింది.. అప్పటికే కొన్ని ట్విస్టులు అర్థమైనా.. వాటిని రివీల్ చేసినపుడు ఆసక్తికరంగా అనిపించింది. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం.. అక్కడ బాగా రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్.

నటీనటులు:

త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి, అఖిల్ రాజ్.. నలుగురు బాగా నటించారు. ఎవరి పాత్ర తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటుడు పృథ్వీ బాగున్నాడు. మైమ్ మధు కూడా బాగా నటించాడు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది.

టెక్నికల్ టీం:

మ్యూజిక్ డైరెక్టర్ RR ధృవన్ మాత్రం పూర్తి న్యాయం చేసాడు. ప్రతి సన్నివేశానికి తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. మేకర్స్ చెప్పినట్లు మరీ గుండె ఆగిపోయేంత భయంగా అయితే లేదు ఈషా.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఈషా.. కొన్ని లోపాలున్నా.. డీసెంట్ హార్రర్ థ్రిల్లరే..!