వైన్స్ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అన్నింటితో పాటు మద్యం షాపులను కూడా మూసివేశారు అధికారులు. అయితే 'గత ఆదివారం మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు లిక్కర్ షాపులు..

వైన్స్ షాపులు తెరుస్తారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఉప్పల్‌కు చెందిన సన్నీగా గుర్తించారు. మంగళవారం మార్చి 31వ తేదీన అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఫేక్ వార్తలను ప్రచారం చేయొద్దని, వందంతులను వ్యాపించవద్దని పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా.. ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అన్నింటితో పాటు మద్యం షాపులను కూడా మూసివేశారు అధికారులు. అయితే ‘గత ఆదివారం మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు లిక్కర్ షాపులు తెరుస్తారని ఆబ్కారీ శాఖ విడుదల చేసినట్లుగా ఓ నకిలీ జీవో’ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే నిజమని నమ్మి.. మద్యం ప్రియులు ఆదివారం వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఆ తరువాత అసలు నిజం బయటపడటంతో.. ఎవర్రా ఇది చేసిందంటూ తిట్టుకుంటూ ఇళ్లకు చేరారు. ఇదికాస్తా అధికారుల దృష్టికి చేరడంతో.. ఫేక్ వార్తను సృష్టించింది ఎవరో తెలుసుకుని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య
సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..
అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ
వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’
వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు
ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి