ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మార్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ క్రమంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 5:01 PM

ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మార్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ క్రమంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు.. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ తెలిపారు. ఇవాళ సీఎం జగన్‌ను కలిసిన.. సూర్యనారాయణ ఈ అంశంపై చర్చించారు. ఇది విరాళం లేక కోత కాదని.. ఈ నెలలో సగం జీతం ఇచ్చి, సర్దుబాటు అయ్యాక మిగతా సగ జీతాన్ని తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ వెల్లడించారు. ఆపత్కాల పరిస్థితి వల్ల రెండు వితలుగా తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు సూర్యనారాయణ తెలిపారు.

కేవలం ఇబ్బందుల కారణంగా మాత్రమే రెండు దఫాలుగా మార్చి జీతం ఇస్తామన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏమీ బాగోలేదని.. లాక్‌డౌన్ కారణంగా రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి తరుపున తాను సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలను వాయిదా వేశాయి. ఇప్పుడు వీరి బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి: సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!