కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!

ఇప్పుడు మన దేశంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఎఫెక్ట్‌‌కి ఇప్పటికే 30 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే 6,60,0064 కేసులు నమోదు కాగా.. వీరిలో 14,1422 మంది కోలుకున్నారు. ప్రజలు కరోనా వైరస్‌ను తేలిగ్గా..

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2020 | 3:39 PM

ఇప్పుడు మన దేశంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఎఫెక్ట్‌‌కి ఇప్పటికే 30 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే 6,60,0064 కేసులు నమోదు కాగా.. వీరిలో 14,1422 మంది కోలుకున్నారు. ప్రజలు కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారా.. లేక కరోనా వరస్ మరింత బలంగా వ్యాపిస్తోందా.. తెలీడం లేదు కానీ ఆలోచిస్తే రెండూ జరుగుతాయన్న సమాధానం వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ భయపెడతూ.. ప్రళయ తాండవం సృష్టిస్తోంది. కాగా ఈ వైరస్ సోకితే చనిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అది నిజం కాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 శాతం మంది మాత్రమే చనిపోయారు.

అయితే ఈ వైరస్ సోకిన మొదటి రోజు నుంచి.. ఆఖరి రోజు వరకూ ఎలా ఉంటుందనేది.. టీవీ9 ప్రత్యేకమైన సమాచారం మీకందిస్తుంది. దీని వల్ల లాభమేంటంటే.. అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే.. వెంటనే అలెర్ట్ అవ్వొచ్చు. దీంతో తొందరగా నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డే1: వికారంగా.. ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి ఇతర సమస్యలను పెంచుతోంది. డే2: అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు వస్తాయి డే3: అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు మరింతగా పెరుగుతాయి. జ్వరం కూడా అధికంగా ఉంటుంది డే4: నాలుగో రోజు కూడా పైన చెప్పిన సమస్యలు కంటిన్యూ అవడంతో పాటు గొంతు నొప్పిగా ఉంటుంది డే5: పైన చెప్పిన సమస్యలతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది డే6 కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి డే7: మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. డే8: ఈ సమయంలో ARDS(ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) అనే సమస్య ఏర్పడుతుంది. అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. ఈ స్టేజ్‌లో బలహీనంగా ఉన్నవారు చనిపోయే ప్రమాదముంటుంది డే9 కూడా ARDS సమస్య మరింత తీవ్రత పెరుగుతుంది డే10: పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువగా నొప్పి వస్తుంది. ఆకలి వేయదు. కొంతమంది మాత్రం చనిపోతూంటారు. ఇక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ 2 శాతమే.

ఇక 11వ రోజు నుంచి 17వ రోజు వరకూ ఆస్పత్రిలో చేరితే.. రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి.. డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.

ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదనే అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే.. మొదటి 5 రోజుల్లోనే ఆస్పత్రిలో చేరడం మంచింది. లేదంటే ఆ తరువాత ఈ వైరస్ మరింత కఠినంగా మారుతుంది. దీంతో మన చేతులతోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి దయచేసి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటే ఆస్పత్రిలో చేరడం మంచిది.

ఇవి కూడా చదవండి: 

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్